Chiranjeevi : ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి అధికారం కోసం తమకు అడ్డు అని భావిస్తున్న వారందరినీ తమ రొంపి లోకి దూర్చి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నది. తమపై విమర్శ చేస్తే చాలు వారిని తమ శత్రువులుగా భావిస్తున్నది వైసీపీ. తమకు భజన చేస్తే చాలు వాళ్లను నెత్తిన పెట్టకుంటున్నది. తమ ప్రత్యర్థులను విమర్శిస్తే చాలు అనుకునే స్థితికి దిగజారిపోయింది. తమ పార్టీ నేతలు ప్రత్యర్థులపై బూతు పురాణాలు మొదలెట్టినా ఆ పార్టీ నేతలకు అవి కీర్తనల్లాగానే వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రజలు అధికార పార్టీ అనగానే చీదరించుకునే స్థాయికి పడిపోయింది.
టాలీవుడ్ ను ఏలిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో కి వచ్చి ఈ రొంపి వద్దని బయటకు వెళ్లారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదేళ్ల క్రితం జనసేన పార్టీ పెట్టినా అన్నయ్య మెగాస్టార్ అంటీ ముట్టనట్లుగానే ఉన్నాడు. తన పనేదో తాను చేసుకున్నాడు తప్ప తమ్ముడి పాలిటిక్స్ విషయంలో జోక్యం చేసుకోలేదు. పదేళ్లుగా ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా ముందకు సాగుతున్న తమ్ముడిని నేరుగానే ఆశీర్వదించాడు. రైతుల కోసం పవన్ కల్యాన్ చేస్తున్న పోరాటాన్ని గుర్తించి తన వంతుగా సాయం అందించాడు. తన కుటుంబ సభ్యులను కూడా చేయూతనందించమని కోరాడు
ఓర్చుకోలేకపోతున్న వైసీపీ
తమ్ముడిని అన్న ఆశీర్వదించడంతో అధికార పార్టీ వైసీపీ ఓర్చుకోలేకపోతున్నది. ఇక చిరంజీవిపై బుర జల్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి చిరంజీవిపై మాటల యుద్ధానికి తెరతీశాడు. కానీ ఈ టైమ్ లో చిరంజీవి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే వైసీపీకే నష్టమని తెలుసు. ఇక తమ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. చిరంజీవి విషయంలో ఎలా మెదులుకోవాలో పార్టీ నేతలకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక తమ పార్టీ తరపున సొంత మీడియాలో చిరంజీవిపై ప్లాన్ ప్రకారం బురదజల్లేందుకు గేట్లు ఎత్తేశారు.
పవన్ కళ్యాణ్ ఒత్తిడి తోనే చిరంజీవి రూ.5 కోట్లు ఇచ్చి ఉండవచ్చంటూ సాక్షి అనుమానాలు వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డి తన వద్దకు వచ్చిన చిరంజీవి అండ్ సినీ బృందాన్ని ఎంతో గౌరవించారని, కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లే వారి గురించి తప్పుగా మాట్లాడారంటూ వైసీపీ మీడియా ఇప్పుడు కొత్తగా చెబుతున్నది. మెగాస్టార్ చిరంజీవి కూడా కూడా పవన్ కళ్యాణ్ లాగే మారుతున్నారని వైసీపీ మీడియా తనదైన పంథాలో తేల్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆయకు పద్మవిభూషణ్ బిరుదు ఇవ్వడంతోనే బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారనే అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం. ఇన్ని రోజులు తన వ్యక్తి్త్వాన్ని కాపాడుకున్న చిరంజీవి ఇప్పుడు దారి తప్పుతున్నాడంటూ వేలెత్తి చూపుతున్నది.
ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి వైసీపీ, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తే అప్పుడు ఉత్తముడుగా కనిపించే వారు కావచ్చు. ఆహా, ఓహో అంటూ భజన చేసేదేమో వైసీపీ మీడియా. కానీ టిడిపి, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు అని చెప్పినందుకు వైసీపీ తనకున్న బురదను చిరంజీవికి రుద్దే ప్రయత్నం మొదలు పెట్టింది. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో ఎవరికీ రాజకీయ స్వేచ్ఛ లేదనుకోవాలేమో?
చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డుకి మించిన అవార్డులకు అర్హుడని ఇండస్ట్రీకి తెలుసు. చిరంజీవిని జగన్ ఎంతగానో గౌరవించారంటూనే పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిన్నందుకే మెగాస్టార్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లే జనసేన పార్టీకి 5 కోట్లు ఇచ్చారంటూ నీచరాతలకు దిగడం సమజంసమేనా అని ఏపీ ప్రజలు పేర్కొంటున్నారు. తనకు మద్దతు ఇవ్వలేదన్న బాధకన్నా ప్రత్యర్థి కూటమికి మద్దతు ప్రకటించాడనే ఆక్రోశం జగన్ లో కనిపిస్తున్నది. జగన్ ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుందమేమో మరి..