UPI apps : అవసరం లేకున్నా కొనిపడేస్తున్నారు.. యూపీఐ యాప్స్ తో జేబులకు చిల్లు!

UPI apps

UPI apps

UPI apps : జేబులో పర్సు ఉండాల్సిన అవసరం లేదు. ఆ పర్సులో చిల్లిగవ్వ లేకపోయినా ఫర్వాలేదు. డబ్బుల కట్టలు మోసుకెళ్లాల్సిన పని లేదు. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అందులో యూపీఐ యాప్స్ ఉంటే చాలు.. రాజా లాగా ఎక్కడికైనా వెళ్లి తిరిగి రావొచ్చు. సింగిల్ చాయ్ నుంచి కాస్ట్ లీ వస్తువు వరకు ఏదైనా యూపీఐ పేమెంట్స్ తో చెల్లించవచ్చు. స్మార్ట్ ఫోన్ తీశామా..స్కాన్ చేశామా.. డబ్బులు కొట్టామా..అంతే. యూపీఐ చెల్లింపుల వల్ల అంత ఈజీ అయిపోయింది.

యూపీఐ పేమెంట్స్ అత్యంత సౌకర్యవంతం అన్న మాట నిజమే కానీ ఇదంతా నాణేనికి ఒక వైపే. మరోవైపు ఎన్నో నష్టాలు ఉన్నాయి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఓ నివేదిక ప్రకారం ప్రజలు ఖర్చు పెట్టే విధానంపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయట యూపీఐ పేమెంట్స్. ఇవి జనాల జేబులకు చిల్లులు పెట్టుస్తున్నాయంటూ షాకింగ్ నిజాలు బయట పెట్టింది ఆ నివేదిక. ఇంద్రప్రస్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ అనే సంస్థ దేశంలో యూపీఐ చెల్లింపులపై ఓ స్టడీ చేసింది. దీనిలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

యూపీఐ పేమెంట్స్ కు అలవాటైన జనాలు ఖర్చు విషయంలో కంట్రోల్ కావడం కష్టంగా మారింది. అంతకుముందు ఎంత అవసరముంటే అంతే తీసుకెళ్లేవారు. ఇప్పుడు యూపీఐ అందుబాటులో ఉండడంతో ఇష్టారీతిన కొనేస్తున్నారట. ఆ క్షణాన మనసుకు నచ్చితే చాలు అవసరం లేకున్నా ఎడపెడా కొనేస్తున్నారట. యూపీఐ యాప్స్ వల్ల అనవసర ఖర్చులు విపరీతంగా పెరిగాయట.

ఈ నివేదిక ప్రకారం దేశంలో 75 శాతం మంది ప్రజలు ఎక్కువ ఖర్చు చేశారని వెల్లడైంది. దాదాపు 81 శాతం మంది యూపీఐ చెల్లింపులు చేస్తుననారు. యూపీఐ ద్వారా వ్యక్తులు సగటున రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నారు. ఇక యూపీఐ లావాదేవీల సంఖ్య ఏప్రిల్ నెలలో 1330 కోట్లకు చేరుకుంది. ఇలా జనాలకు తెలియకుండా జేబులకు చిల్లులు పెట్టుస్తున్నాయి యూపీఐ యాప్స్ అంటూ నివేదిక ఆందోళన వెలిబుచ్చింది.

TAGS