Diwali celebrations : దీపావళి సంబరాల్లో టపాసులు పేల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Diwali celebrations : దీపావళి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఆనందమే. చిన్నాపెద్దా అంతా టపాసులు కాల్చడానికి ఎంత ఆసక్తి చూపుతారు. అయితే ఇవి కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* క్రాకర్స్ కాల్చేటప్పుడు నిప్పు రవ్వలు పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు టీషర్లు, జీన్స్ వంటి దుస్తులు కాకుండా బాగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది. * క్రాకర్స్ కాల్చేటప్పుడు కంటి అద్దాలు ఉంటే పెట్టుకోవాలి.
* టపాసులు కాల్చేటప్పుడు పక్కనే బకెట్ నీళ్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అనుకోకుండా మంటలు వ్యాపిస్తే ఆర్పడానికి ఇవి ఉపయోగపడతాయి.
* ప్రమాదవశాత్తు దుస్తులపై నిప్పు పడి మంటలు చెలరేగితే దుప్పట్లు లేదా రగ్గులు వంటి మందపాటి బట్టను కప్పేయాలి.
* క్రాకర్స్ కాల్చేటప్పుడు తప్పకుండా చెప్పులు వేసుకోవాలి.
* పేలకుండా మధ్యలో ఆగిపోయే టపాసుల జోలికి వెంటనే వెళ్లకూడదు. కొన్నిసార్లు అవి పేలే ప్రమాదం ఉంది.
* క్రాకర్స్ కాల్చేటప్పుడు పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి. టపాసులను కాల్చడానికి వారిని ఒంటరిగా వదలొద్దు.
* పెద్ద శబ్దం వచ్చే బాంబులను పేల్చేటప్పుడు పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో కాటన్ పెట్టడం మంచిది. ఆ శబ్ద తీవ్రతకు కొన్నిసార్లు చెవిలో కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది.
* ఇంట్లో లేదా పరిసర ప్రాంతాల్లో వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఉంటే భారీ శబ్దం వచ్చే బాంబులను పేల్చకూడదు.
* మద్యం సేవించి టపాసులను కాల్చవద్దు. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది.