JAISW News Telugu

Credit Cards : ఈ క్రెడిట్ కార్డులు లైఫ్ టైమ్ ఫ్రీ తెలుసా.. బెనిఫిట్స్ కూడా ఎక్కువే!

Credit Cards

Credit Cards

Credit Cards : అక్రమ వసూళ్లకు పాల్పడే వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టడం, ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇండియా బ్యాంకింగ్ రంగం ముందుకు వచ్చింది. ఇబ్బడి ముబ్బడిగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. వీటితో సాధారణ మధ్య తరగతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా ఖర్చు పెడుతున్నాడు. నెల చివర కట్టుకుంటున్నాడు.

అయితే క్రెడిట్ కార్డులను వాడాలంటే జాయినింగ్ ఫీజుతో పాటు వార్షిక చార్జీలను కూడా కట్టాల్సి వస్తుంది. మీరు కార్డును వాడినా.. వాడకున్నా.. రుసుమును మాత్రం చెల్లించాల్సిందే. అయితే కొన్ని బ్యాంకులు వీటిని ఉచితంగాకూడా అందిస్తున్నాయి. వాటిపై ఎలాంటి వార్షిక రుసుం, రెన్యువల్ ఫీజు చార్జి చేయడం లేదు. అంటే ఈ కార్డులు లైఫ్ టైం ఫ్రీ. వీటితో భారీగానే ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

హెచ్‌డీఎఫ్‌సీ షాపర్స్‌ స్టాప్‌
ప్రైవేట్ రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ ‘షాపర్స్‌ స్టాప్‌’ పేరిట క్రెడిట్ కార్డును తెచ్చింది. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ కార్డు. ఫ్యూయల్ మినహా ‘షాపర్స్ స్టాప్’ బ్రాండ్‌లు, ఇతర కేటగిరీలపై చేసే ప్రతి రూ.150 ఖర్చుకు 6 ఫస్ట్‌ సిటిజెన్‌ పాయింట్లను పొందవచ్చు. నెలలో ఎక్కువలో ఎక్కువగా 500 ఫస్ట్ సిటిజన్ పాయింట్లు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక, ఇతర కొనుగోళ్లపై 2 ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్లు లభిస్తాయి.

యాక్సిక్‌ బ్యాంక్‌ మై జోన్
యాక్సిస్‌ బ్యాంక్ జారీ చేసే ‘మై జోన్‌’ క్రెడిట్‌ కార్డ్‌ కూడా లైఫ్‌ టైమ్‌ ఫ్రీ. ఈ కార్డుతో  స్విగ్గీలో ఒక్కో ఆర్డర్‌పై రూ.120 డిస్కౌంట్‌ వస్తుంది. నెలకు 2 సార్లు డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది. ప్రతి రూ.200 ఖర్చుపై 4 ఎడ్జ్‌ రివార్డ్ పాయింట్లు దక్కుతాయి.

ఐసీఐసీఐ బ్యాంక్‌ అమేజాన్ పే
ఎలాంటి జాయినింగ్‌ ఫీజు, వార్షిక రుసుం లాంటివి లేకుండా ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘అమెజాన్‌ పే’ క్రెడిట్‌ కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డు ను ఉపయోగించి అమెజాన్‌ కొనుగోళ్లపై ప్రైమ్‌ మెంబర్స్ కు5 శాతం, నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌కు 3 శాతం డిస్కౌంట్‌ ఇస్తుంది. డిజిటల్‌, గిఫ్ట్‌ కార్డ్‌ కొనుగోళ్లపై రెండు శాతం, అన్ని రకాల ఇతర లావాదేవీలపై ఒక శాతం చొప్పున క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ఒక్కో రివార్డు పాయింట్‌ రూ. 1కి సమానం. ‘అమెజాన్‌ పే బ్యాలెన్స్‌’లో డబ్బులు యాడ్‌ అవుతాయి.

ఐసీఐసీఐ ప్లాటినమ్‌ చిప్‌
ఐసీఐసీఐ ‘ప్లాటినమ్‌ చిప్’ క్రెడిట్ కార్డుతో ఫ్యూయల్ మినహా అన్ని రిటైల్ కొనుగోళ్లపై ప్రతి రూ.100కు 2 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. యుటిలిటీస్, ఇన్సూరెన్స్ కేటగిరీలపై ప్రతి రూ.100కు ఒక రివార్డ్‌ పాయింట్‌ వస్తుంది. హెచ్‌పీసీఎల్‌ బంకులో రూ.4 వేల ఇంధన కొనుగోలుపై ఒక శాతం సర్‌ఛార్జి మినహాయింపు పొందవచ్చు.

కోటక్‌ ‘811 డ్రీమ్‌ డిఫరెంట్‌’
వార్షిక రుసుం, జాయినింగ్‌ ఫీజు లేకుండానే కోటక్‌ మహీంద్రా ‘811 డ్రీమ్‌ డిఫరెంట్’ క్రెడిట్‌ కార్డును మంజూరు చేస్తోంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ప్రతి రూ.100కు 2 రివార్డ్‌ పాయింట్లు, ఆఫ్‌లైన్‌ లో రూ.100రే ఒక రివార్డ్‌ పాయింట్‌ పొందవచ్చు. రూ.500 నుంచి రూ.3 వేల వరకు చేసే ఇంధన కొనుగోళ్లపై ఒక శాతం మినహాయింపు ఇస్తుంది. ఐఆర్‌సీటీసీపై చేసే లావాదేవీలపై 1.8 శాతం, రైల్వే బుకింగ్‌ కౌంటర్లలో చేసే లావాదేవీలపై 2.5 శాతం తగ్గింపు లభిస్తుంది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఫార్చూన్ గోల్డ్
కోటక్‌ మహీంద్రా ‘ఫార్చూన్‌ గోల్డ్‌ కార్డ్’కు కూడా ఎలాంటి రుసుములు లేవు. ఈ కార్డు ఇంధన కొనుగోళ్లపై సంవత్సరంలో రూ.3,500 వరకు రాయితీ కల్పిస్తుంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈజీ క్రెడిట్
బ్యాంక్ ఆఫ్‌ బరోడా ‘ఈజీ క్రెడిట్ కార్డు’ కూడా ఫ్రీ. ఈ కార్డు మంజూరైన 60 రోజుల్లో రూ.6 వేలు, ఏడాదిలో రూ.35 వేలు ఈ కార్డుతో ఖర్చు చేస్తే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈజీ క్రెడిట్‌ కార్డులపై ఎటువంటి వార్షిక రుసుం ఉండదు. మూవీ, డిపార్ట్‌‌మెంట్‌ స్టోర్ల ఖర్చులో ప్రతి రూ.100పై 5 క్రెడిట్‌ పాయింట్లు వస్తాయి. రూ.400 నుంచి రూ.5 వేల వరకు కొనుగోళ్లపై ఒక శాతం మినహాయంపు ఉంటుంది.

వీటితో పాటు కెనరా బ్యాంక్‌ ‘క్లాసిక్‌ వీసా ఇండివిడ్యువల్’, యెస్‌ బ్యాంక్‌ ‘ప్రాస్పరిటీ పర్చేజ్‌’, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ‘ఎల్‌ఐటీ’, హెచ్‌ఎస్‌బీసీ ‘వీసా ప్లాటినమ్‌’ క్రెడిట్ కార్డు కూడా ఎలాంటి ఫీజులు లేకుండా జారీ చేస్తారు.

Exit mobile version