CMs Criminal Cases : అత్యధిక క్రిమినల్ కేసులున్నా టాప్-5  సీఎంలు, మాజీ సీఎంలు వీరే!

CMs Criminal Cases

CMs Criminal Cases

Top 5 CMs With Highest Criminal Cases : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్. 140 కోట్లకు పైగా జనాభా. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు దాటినా ఇంకా అభివృద్ధి చెందిన దేశంగానే ఉంది. దాదాపు 300 వందల ఏండ్లు పాలించి మన సంపాదనంతా దోచుకెళ్లి ప్రపంచంలోనే దుర్భర దేశంగా వదిలేసివెళ్లారు. దేశంలో సారవంత భూములు ఉన్నా అత్యంత జనాభా, పేదరికం, నిరుద్యోగం, అవినీతి..ఇలా భారత్ కు లేని దుర్భర పరిస్థితులు ఏ దేశానికి లేవు. ఈక్రమంలో గత ప్రభుత్వాలు మూడు అడుగులు ముందుక్కి..ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా దేశ అభివృద్ధి ముందుకు సాగుతోంది. దీనికి పాలకుల అవినీతి, దూరదృష్టి లేకపోవడమే.

ప్రజాస్వామ్యంలో జనాకర్షక పథకాలు పెట్టి ఓట్లు వేయించుకున్నామా..ఇక ఐదేండ్లు తమకు ఢోకా లేదు..ఎంత దోచుకుందామా అన్న ధోరణి నేటి పాలకుల్లో పెరిగిపోయింది. ఎన్నికల్లో గెలవడం అంటే అవినీతికి ప్రజలు లైసెన్స్ ఇచ్చినట్టే అనుకుంటున్నారు నేటి పాలకులు. అందుకే ఏ దేశంలో లేనంత అవినీతి మన దేశంలో రాజ్యమేలుతోంది. లక్ష రూపాయలు పెట్టి వార్డ్ మెంబర్ గా గెలిచిన వ్యక్తి తన పదవి కాలంలో పది లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక ఎమ్మెల్యేనో, ఎంపీలు చేసే అవినీతి ఎంతుంటుంది..? ఇక సీఎంల అవినీతి మేత ఎంతుండాలి..? అలాగే కబ్జాలు, హత్యలు, దోపిడీ..ఇలా ఎన్ని చూసి ఉండాలి.

భారత్ లో పాలకుల అవినీతిని మాటల్లో చెప్పలేం. అలాగే వారిపై ఉన్న కేసులకు లెక్కే ఉండదు. అధికారిక లెక్కల ప్రకారం భారత్ లో పలు సీఎంలపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియజేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో మన తెలుగు రాష్ట్రాల సీఎం, మాజీ సీఎంలు టాప్ లో ఉండడం గమనార్హం.

1. తెలంగాణ సీఎం కేసీఆర్(ప్రస్తుతం మాజీ) :64 క్రిమినల్ కేసులు

2. తమిళనాడు సీఎం స్టాలిన్ : 47 క్రిమినల్ కేసులు

3. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ : 38 క్రిమినల్ కేసులు

4. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే: 18 క్రిమినల్ కేసులు

5. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్: 13 క్రిమినల్ కేసులు

TAGS