JAISW News Telugu

2023 Rewind:2023లో టాప్- 5 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే

2023 Rewind:2023 భార‌తీయ సినిమాకి మ‌ర‌పురాని సంవ‌త్స‌రం. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అనే తార‌త‌మ్యాన్ని త‌గ్గించిన ఏడాది ఇది. ఈ సంవత్స‌రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక గొప్ప శకానికి వేదికగా నిలిచింది. కొన్ని భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లు నిర్మాత‌లు, పంపిణీదారుల‌కు గొప్ప లాభాల్ని తెచ్చి పెట్టాయి. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టి స‌త్తా చాటారు. షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, ద‌ళ‌ప‌తి విజ‌య్, సూప‌ర్ స్టార్ రజనీకాంత్ సహా ప‌లువురికి చెప్పుకోద‌గ్గ విజ‌యాలు సాధ్య‌మ‌య్యాయి. కొంద‌రికి గ్రేట్ కంబ్యాక్ సాధ్య‌మైంది. ఈ ఏడాది అద్భుత విజయాలు సాధించిన సినిమాలు స్టార్ల గురించి ప‌రిశీలించి వారి స్మారక విజయాల వెనుక గల కారణాలు ఆస‌క్తిక‌రం.

1.జ‌వాన్:
షారుఖ్ ఖాన్ జవాన్ 2023లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1152 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దేశీయ నికర వసూళ్లు మొత్తం 640.8 కోట్లు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ మాస్ లో బాస్ గా దూసుకెళ్లింది. షారుఖ్ ఖాన్ నటనా నైపుణ్యాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఈ చిత్రం హిందీ పరిశ్రమ సామర్థ్యాన్ని వెలికి తీసింది. ఇందులో ద‌ళ‌ప‌తి విజయ్ అతిథి పాత్రలో కనిపించ‌గా, నయనతార, దీపికా పదుకొనే ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించారు.

2.పఠాన్
కింగ్ ఖాన్ కి గ్రేట్ కంబ్యాక్ ని ఇచ్చిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా 1050.8 కోట్ల వసూళ్లు, దేశీయంగా 543.4 కోట్ల వసూళ్లు రాబట్టిన పఠాన్ చిత్రంతో బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ మరోసారి తన సత్తాను చాటాడు. ఇతర పరిశ్రమ ప్రముఖులతో ఖాన్ క‌లయిక‌ నిస్సందేహంగా యాక్షన్-ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది.

3.యానిమ‌ల్
రణబీర్ కపూర్ యానిమల్ ప్రపంచవ్యాప్తంగా 772.2 కోట్ల గ్రాస్, 468.0 కోట్ల దేశీయ నికర వసూళ్లను సాధించి భారీ విజయం న‌మోదు చేసింది. ఈ చిత్రం 1000 కోట్ల క్ల‌బ్ వైపు దూసుకెళుతోంది. ఈ సినిమా గ్రిప్పింగ్ కథనం..ర‌ణ‌బీర్ కపూర్ అద్భుతమైన నటన ప్రేక్షకులను మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తున్నాయి. పరిశ్రమ ప్రముఖ నటులలో ఒకరిగా ర‌ణ‌బీర్ స్థానాన్ని నిల‌బెట్టిన చిత్ర‌మిది. ఈ సినిమాతో తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ వంగా పేరు మ‌రోసారి బాలీవుడ్ లో మార్మోగింది. దేశ‌వ్యాప్తంగా సందీప్ వంగా చ‌ర్చ‌ల్లోకొచ్చాడు. ఇప్పుడు అత‌డు మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్.

4.గదర్ 2
సన్నీ డియోల్ గదర్ 2 చిత్రంతో వెండితెరపైకి తిరిగి వచ్చాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 687.8 కోట్ల గ్రాస్.. 525.2 కోట్ల‌ దేశీయ నికర వ‌సూళ్ల‌ను సాధించింది. ఒరిజినల్ `గదర్`కి ఇది సీక్వెల్ అయినా రీఫ్రెషింగ్ క‌థ‌నంతో ఆక‌ట్టుకుంది. డియోల్ శక్తివంతమైన పెర్ఫామెన్స్ ఈ చిత్రం అసాధార‌ణ‌ విజయానికి కార‌ణం.

5.లియో
ద‌ళ‌ప‌తి విజయ్ – లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన లియో ప్రపంచవ్యాప్తంగా 618.5 కోట్ల గ్రాస్ , 298.1 కోట్ల షేర్‌తో అద్భుతాలు చేసింది. ఈ కోలీవుడ్ చిత్రం ప్రాంతీయ సరిహద్దులను అధిగమించింది. క్రిటిక్స్ నుంచి చాలా విమ‌ర్శ‌లు, ద్వితీయార్థంలో కొన్ని త‌ప్పిదాలు వెర‌సి లియోపై కొంత గంద‌ర‌గోళం ఉన్నా కానీ విజ‌య్ స్టామినా ముందు అవేవీ విజ‌యాన్ని ఆప‌లేక‌పోయాయి. అంతర్జాతీయ చలనచిత్ర ల్యాండ్‌స్కేప్‌పై ప్రాంతీయ సినిమా ఎదుగుద‌ల‌కు ఇది సూచిక‌.

6.జైలర్
ప్రపంచవ్యాప్తంగా 605.8 కోట్ల గ్రాస్ , 293.9 కోట్ల షేర్ సాధించిన జైలర్ చిత్రంతో సూప‌ర్ స్టార్ రజనీకాంత్ కి గ్రేట్ కంబ్యాక్ సాధ్య‌మైంది. బాక్సాఫీస్ వద్ద ర‌జ‌నీ ఇప్ప‌టికీ కమాండ్ కొనసాగిస్తున్నారు. అత‌డు త‌న‌దైన మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మైమ‌రిపించారు. జైల‌ర్ కథనం ప‌ర్ఫెక్ట్ లెంగ్త్ తో కుదిరింది. ఈ సినిమా విజ‌యంతో నెల్స‌న్ దిలీప్ కి మంచి గుర్తింపు ద‌క్కింది.

7.టైగ‌ర్ 3
సల్మాన్ ఖాన్ `టైగర్ 3`పై క్రిటిక్స్ విమ‌ర్శ‌లు ఎదురైనా కానీ, స‌ల్మాన్ ఖాన్ స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూప‌ణ అయింది. ప్రపంచవ్యాప్తంగా 466 కోట్ల గ్రాస్ , 284కోట్ల దేశీయ నికర కలెక్షన్ ల‌ను సాధించింది. ఖాన్ సిగ్నేచర్ స్టైల్ సినిమా హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు అభిమానుల‌ను అల‌రించాయి. బాక్సాఫీస్ ఓపెనింగుల్లో ఖాన్ స‌త్తా చాటారు. నెగెటివ్ రివ్యూల ప్ర‌భావంతో టైగ‌ర్ 3 యావ‌రేజ్ ఫ‌లితంతో స‌రిపెట్టుకుంది.

జవాన్-పఠాన్-యానిమల్-గదర్ 2-లియో-జైలర్-టైగర్ 3 వంటి చిత్రాలతో భారతీయ సినిమాకు 2023 నిస్సందేహంగా బ్లాక్‌బస్టర్ ఇయర్‌గా నిలిచింది. పరిశ్రమలోని పెద్ద హీరోలు స‌త్తా చాటారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో విభిన్న కథాంశాలకు ప్రపంచ స్థాయి ఆకర్షణ ఉంద‌ని కూడా నిరూపించాయి.

Exit mobile version