JAISW News Telugu

Top 10 Telugu TRP Shows : టాప్ 10 తెలుగు టీఆర్పీ తెచ్చుకున్న షోలు ఇవే.. బిగ్ బాస్ ముందా.. జబర్దస్త్ ముందా?

Top 10 Telugu TRP Shows

Top 10 Telugu TRP Shows

Top 10 Telugu TRP Shows : తెలుగులో ఎప్పటి నుండో ఆధిపత్యం కొనసాగిస్తున్న ఛానెల్ ఏది అంటే అది ఈటీవీ అని తెలుగు వారంతా టక్కున చెబుతారు.. కానీ తర్వాత తర్వాత ఈటీవీ ఛానెల్ కు పోటీగా చాలా ఛానెల్స్ వచ్చాయి.. జెమిని టీవీ వచ్చింది కానీ అది తట్టుకోలేక పోయింది. ఇక ఆ తర్వాత జీ తెలుగు, మా టివిల హవా కొనసాగుతుంది..

ఇక ఈటీవీ కూడా జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్ వంటి షోలతో టాప్ టీఆర్పీ తెచ్చుకుంది.. అలాగే ఢీ వంటి డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఈ ఛానెల్ కు బాగా టీఆర్పీ వచ్చేలా చేసింది. అయితే సీరియల్స్ విషయంలో మాత్రం మా టీవీ ఈటీవీ కంటే ముందు ఉంది.. ఇక స్టార్ మా చేతికి బిగ్ బాస్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఈ ఛానెల్ రేంజ్ మరింతగా మారిపోయింది..

ఈ మధ్య ఈటీవీకి ఆయువుపట్టుగా ఉన్న జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్ వంటి షోలకు ఆదరణ తగ్గింది.. ఎవరి వల్ల అయితే హిట్ అయ్యిందో వారంతా ఈ షో వదిలి వెళ్ళిపోయినా తర్వాత ఈటీవీ టీఆర్పీ బాగా తగ్గింది.. అదే సమయంలో ఇప్పుడు స్టార్ మా బిగ్ బాస్ సరికొత్త సీజన్ ను స్టార్ట్ చేసి ఈటీవీకి మరింత దెబ్బ కొట్టారు.

ఇప్పుడు స్టార్ మా లో బిగ్ బాస్ 7 సీజన్ సరికొత్తగా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. రసవత్తరంగా ఈ షో కొనసాగుతుంది.. మరి తాజాగా తెలుగు టాప్ ప్రోగ్రాం టీఆర్పీను బార్క్ వెం సైట్ విడుదల చేసింది.. అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 వరకు తెలుగులో టాప్ టీఆర్పీ సాధించిన ప్రోగ్రామ్స్ లిస్టు రిలీజ్ చేసారు.

మరి ఈ లిస్టులో టాప్ లో బిగ్ బాస్ షో ఉంది.. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు వీకెండ్ 6.9 టీఆర్పీ అందుకుంది.. ఇక వీక్ డేస్ లో 4.91 రేటింగ్ ఉంది.. ఇదే షో సీజన్ 6 ప్రసారం అవుతున్న సమయంలో వీక్ డేస్ లో 2, వీకెండ్ లో 3 రేటింగ్ వచ్చేది.. ఇక మూడవ స్థానంలో శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఆదివారం స్టార్ మా పరివార్ 4.24 టీఆర్పీ సొంతం చేసుకుంది..

ఇలా టాప్ 3 కూడా స్టార్ మా సొంతం చేసుకోవడం విశేషం.. ఇక 4వ స్థానమో శ్రీదేవి డ్రామా కంపెనీ 3.54 టీఆర్పీ రేటింగ్ దక్కించుకోగా ఎక్స్ట్రా జబర్దస్త్ 3.34 రేటింగ్ తో 5వ స్థానంలో ఉండగా జబర్దస్త్ 3, ఢీ షో 2.46 టీఆర్పీను రాబట్టాయి. ఆ తర్వాత స్థానాల్లో సుమ అడ్డా, అలీతో ఆల్ ఇన్ వన్, పాడుతా తీయగా వంటి షోలు టాప్ 10లో ఉన్నాయి. టాప్ 10లో ఈటీవీ, మా టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉండడం విశేషం..

Exit mobile version