Top 10 Movies : టాలీవుడ్ లో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన టాప్ 10 సినిమాలు ఇవే..!
Top 10 Movies : బాహుబలి సిరీస్ తర్వాత మన తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగింది. అప్పటి వరకు కేవలం మన తెలుగు వాళ్లకు మాత్రమే పరిమితమైన మన టాలీవుడ్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ ని సంపాదించుకుంది. స్టార్ హీరోలు మాత్రమే రికార్డ్స్ ని నెలకొల్పగలరు అనేది మొన్నటి మాట. కానీ కంటెంట్ ఉంటే అసలు మార్కెట్ లేని హీరో కూడా పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టగలరు అనేది నేటి మాట.
మొన్న సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం ఇది నిరూపించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇప్పటికీ ట్రేడ్ ని ఆశ్చర్యపరిచే విధంగానే ఉన్నాయి. కొంత మంది స్టార్ హీరోలకు సాధ్యం కానీ వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి కేవలం పది రోజుల్లోనే చేరిపోయిన ఈ సినిమా, త్వరలోనే నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది.
ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 25 కోట్ల రూపాయిలు మాత్రమే. ఇప్పటి వరకు 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే వందకోట్ల రూపాయలకు పైగానే లాభాలను అర్జించింది అన్నమాట. టాలీవుడ్ లో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల లిస్ట్ ని ఒకసారి చూస్తే, రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రానికి 500 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత బాహుబలి 1 చిత్రానికి 186 కోట్ల రూపాయిలు రాగా,#RRR చిత్రానికి 163 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ఇలా కేవలం రాజమౌళి సినిమాలకు తప్ప స్టార్ హీరోలకు వంద కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టిన సినిమా మరొకటి లేదు. కానీ ‘హనుమాన్’ చిత్రం ఈ లిస్ట్ లో చేరడం ట్రేడ్ పండితులను సైతం నోరెళ్లబెట్టేలా చేసిన విషయం.
ఇక హనుమాన్ తర్వాత అత్యధిక లాభాలను రాబట్టిన సినిమాలను చూస్తే అలా వైకుంఠపురం లో చిత్రానికి 75 కోట్ల రూపాయిల లాభాలు రాగా, గీత గోవిందం సినిమాకి 55 కోట్ల రూపాయిల లాభాలు వచ్చింది. ఇక ఆ తర్వాత ఎఫ్ 2 చిత్రానికి 50 కోట్ల రూపాయిల లాభాలు రాగా, వాల్తేరు వీరయ్య సినిమాకి 48 కోట్ల రూపాయిల లాభాలు వచ్చింది. వీటి తర్వాత 2018 వ సంవత్సరం లో విడుదలైన రామ్ చరణ్ రంగస్థలం చిత్రానికి 48 కోట్ల రూపాయిల లాభాలు వచ్చింది. ఇలా టాలీవుడ్ లో అత్యధిక లాభాలను రాబట్టిన టాప్ 10 సినిమాలలో 5 సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలవి అవ్వడం విశేషం.