Top 10 Car Brands : సాధారణ మధ్య తరగతి కుటుంబమైనా కారు కంపల్సరీగా మారింది. పెరుగుతున్న ఆదాయం, కుటుంబం కూడా పెద్దది కావడం, తదితర కారణాలతో మధ్య తరగతి వారు కారుకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు. కార్ల కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు ఏ సంవత్సరం, ఏ నెల ఏఏ కార్లు ఎక్కువ అమ్ముడు పోయాయోనని జాబితా విడుదల చేస్తాయి. ఇందులో భాగంగా 2024, జనవరిలో ఏఏ కార్లు ఎక్కువగా అమ్ముడు పోయాయో ఇక్కడ తెలుసుకుందాం.
* జనవరి, 2024లో 1.67 లక్షల యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకి అగ్రస్థానంలో కొనసాగుతోంది. నెలవారీగా 60 శాతం వృద్ధి సాధించింది. ఇక, వార్షిక అమ్మకాలను పరిశీలిస్తే 13 శాతానికి పైగా పెరిగింది.
* ఈ మంత్ లో అత్యధిక కార్ల జాబితాలో హ్యుందాయ్ రెండో స్థానం దక్కించుకుంది. దీని నెలవారి అమ్మకాలు 34 శాతం పెరిగాయి. వార్షిక అమ్మకాలు 14 శాతం పెరిగాయి.
* టాటా మూడో స్థానానికి పడిపోయినప్పటికీ, నెలవారి 23 శాతంగా, వార్షిక అమ్మకాలలో దాదాపు 12 శాతం వృద్ధి కనబర్చింది. ఇది కంపెనీకి సానుకూల అంశమే అయినా రెండో ప్లేస్ ను కోల్పోయింది. జనవరిలో మొత్తం 50వేల యూనిట్ల అమ్మకాలను సాధించింది.
* మహీంద్రా విక్రయాలు జనవరి, 2024లో 40 వేల యూనిట్ల మార్కును దాటాయి. దాని నెలవారి అమ్మకాలు 22.5 శాతం పెరిగాయి. వార్షిక గణాంకాలను పరిశీలిస్తే 30 శాతానికి పైగా వృద్ధి సాధించాయి.
* కొరియా కంపెనీ కియాను పరిశీలిస్తే జనవరి, 2024లో 23 వేల యూనిట్ల కంటే ఎక్కువ నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే రెట్టింపు కార్లను సేల్ చేయగలిగింది. కానీ, జనవరి, 2023తో పోలిస్తే, ఈ ఏడాది విక్రయాల గణాంకాలు 17 శాతం క్షీణించాయి.
* టయోటా వార్షిక అమ్మకాల్లో అమ్మకాల్లో 82 శాతానికి పైకి చేరుకొని భారీ పెరుగుదల కనిపించింది. దాని నెలవారీ అమ్మకాలు 8.5 శాతం పెరిగాయి. 10వేల యూనిట్ల విక్రయాల మార్కును దాటిన చివరి బ్రాండ్ ఇదే.
* హోండా నెల వారీ, వార్షిక అమ్మకాలు జనవరిలో ఒకే వృద్ధి కలిగి ఉన్నాయి. దీని నెలవారీ అమ్మకాలు 10 శాతం పెరిగాయి. వార్షిక అమ్మకాలు 11 శాతం వృద్ధిని సాధించాయి.
* రెనాల్ట్ అమ్మకాలు ఏ విధమైన క్షీణతను ఎదుర్కొలేదు. దీని నెలవారీ అమ్మకాలు రెట్టింపయ్యాయి. వార్షిక అమ్మకాలు 27 శాతానికి పైగా పెరిగాయి.
* MG, నెలవారీ, వార్షిక విక్రయాల్లో నష్టాలను చవిచూసిన ఏకైక బ్రాండ్. దీని నెలవారీ అమ్మకాలు 13 శాతానికి పైగా తగ్గాయి. వార్షిక అమ్మకాలు 7 శాతం తగ్గాయి.
* చివరిగా, ఫోక్స్ వ్యాగన్ అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్ల జాబితాలో 10వ స్థానాన్ని ఆక్రమించింది. దీని నెలవారీ అమ్మకాల్లో 33 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసినప్పటికీ, వార్షిక అమ్మకాల గణాంకాలు 12 శాతానికి పైగా పెరిగాయి.