Ayodhya Temple : అయోధ్య రామ మందిరం ప్రత్యేకతలు ఇవే.
Ayodhya Temple : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది యావత్ భారత దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అయోధ్య శ్రీరామ మందిర పునః ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో శ్రీ అయోధ్య రామ అక్షింతలతో భక్తులు పునీతమ వుతున్నన్నారు. అయోధ్య ఆలయ రూపకల్పనలో దాగి ఉన్న విశేషాలకు సంబంధించిన సమగ్ర సమాచారం మీకోసం..
అయోధ్య రామ మందిరాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 166 అడుగుల ఎత్తు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆలయం ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మంది రానికి మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని చిన్న నాటి బాల రూప విగ్రహం రామ్ లల్లాని ప్రతిష్టిం చబోతున్నారు. కర్ణాటకకి చెందిన శిల్పి దీన్ని రూపొందించారు.
మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తన మండపాలు ఉన్నాయి. మందిరం చుట్టూ ప్రాకార గోడ నిర్మించారు. భూకంపాలు తట్టుకునే విధంగా 2 అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు. 14 అడుగుల వెడల్పుతో 732మీటర్ల పొడవైన పెర్కోటా నిర్మించారు. ఈ మందిరంలో ఎక్కడ ఇనుము ఉపయోగించలేదు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70 శాతం పచ్చదనంతో ఈ ఆలయం కనువిందుచేస్తున్నాయి.
ఆలయ వాస్తుశిల్పి శ్రీ (చంద్రకాంత్) సోంపురా. గుజరాత్ లోని సోంపురా కుటుంబం దేవాలయా లను మాత్రమే నిర్మిస్తుంది. ఈ ఒప్పందం 1992లో సంతకం చేయబడింది. ఆర్కిటెక్ట్ కు 1992లో ఈ ఉద్యోగం ఇచ్చారు. అతను అన్ని దేవాలయాల వివరాల తర్వాత.. ఈ అయోధ్య రామ ఆలయా న్ని ‘నగర’ నిర్మాణ శైలిలో నిర్మించాలని నిర్ణయిం చుకున్నాడు. దానికి అనుగుణంగా వివరాలు అందించారు” అని తెలిపారు. సోంపురా కుటుం బంతో సంబంధం కలిగిన దేవాలయాలు భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో వందల సంఖ్యలో ఉన్నాయని ఆయన తెలిపారు. “వాస్తవానికి చంద్రకాంత్ తన తండ్రి ప్రభాకర్ సోంపురాతో కలిసి గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంలో పనిచేశాడు. చంద్రకాంత్ ప్రతిపా దించిన ‘నగర’ శైలిలో.. ఆలయ గర్భగుడి అష్ట భుజి ఆకారంలో ఉండగా.. ఆలయ చుట్టుకొ లత వృత్తాకారంగా ఉంటుంది” అని తెలిపారు.