YCP Leaders : ప్రజలు తిరస్కరించిన ప్రముఖ నేతలు వీరే!

YCP Leaders
YCP Leaders : ఏపీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు ఎందుకు ఓడిపోయామనే దానిపై పోస్ట్ మార్టం నిర్వహించుకుంటున్నారు. పార్టీలోని ఓడిపోయిన ఇతర నేతలకు ఫోన్ చేస్తూ కారణాలను తెలుసుకుంటున్నారు. ఐదేళ్ల పాలన ప్రజలను ఇంతలా ఇబ్బంది పెట్టిందా? అంటూ తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా అతి స్వల్ప మెజారిటీతో గెలవడంపై కూడా ఆరా తీస్తున్నారు. సీఎం క్యాండిడేట్ తన సొంత నియోజకవర్గంలో తక్కువ ఓట్లతో బయటపడడాన్ని చూస్తే వైసీపీ పట్ల వ్యతిరేకత ఎంత పెద్ద మొత్తంలో ఉందో ఇట్టే అర్థం అవుతుంది.
175 స్థానాల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానల్లో మాత్రమే గెలిచింది. గెలిచిన ప్రతీ చోటా అత్తెసరు ఓట్లతోనే బయటపడింది. చావు తప్పి కన్ను లొట్టపడిందన్న చందంగా ఉంది ఈ 11 చోట్ల.
ఓటమి పాలైన ప్రముఖ నేతలు వీరే..