NDA to TDP : టీడీపీకి ఏన్డీయే ఇవ్వనున్న కేంద్రం ఇవ్వనున్న పదవులు ఇవే?

NDA to TDP

NDA to TDP

NDA to TDP : ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు కీలకంగా వ్యవహరించిన టీడీపీకి కేంద్రం బంఫర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 32 సీట్లు చేరుకోకుముందే బీజేపీ ఆగిపోయింది. తన మిత్ర పక్షాలను కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ ను దాటి పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో ఎన్డీయే ప్రభుత్వంలో నరేంద్ర మోడీ మూడో సారి పీఎంగా మరో రెండు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మళ్లీ మోడీ హయాంలోనే నడుస్తామని మిత్రపక్షాలు కూడా ప్రకటించాయి. రానున్న ఐదేళ్లు ప్రభుత్వంకు సహకరిస్తామని వారు హామీ ఇస్తున్నారు.

ఎన్డీయే లో ప్రధాన మిత్ర పక్షాలుగా జేడీ (యూ), టీడీపీ ఉన్నాయి. జేడీ(యూ)కు 12 సీట్లు ఉంటే టీడీపీకి 16 సీట్లు ఉన్నాయి. రెండు కలుపుకుంటే 28 సీట్లు ఉన్నాయి. దీంతో రెండు పార్టీలు ఎన్డీయేలో ముఖ్యపాత్ర పోషించేలా ఉన్నాయి. కీలకమైన సీట్లు ఇచ్చిన పార్టీలు కేబినెట్ పదవులు ఆశించడంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టి టీడీపీ, జేడీ(యూ) ఏఏ కేబినెట్ పదవులు ఆశించవచ్చన్నదానిపై చర్చ జరుగుతోంది. జేడీ (యూ)ను పక్కన పెడితే టీడీపీ ఏఏ కేబినెట్ పదవులు కోరుతుందా? అన్నదానిపై భిన్నమైన చర్చలు తెరపైకి వస్తున్నాయి. బుధవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు సూచా ప్రాయంగా కొన్నింటిని సూచించినట్లు ఎన్డీయే నుంచి లీకులు వచ్చాయి.

ఎన్డీయేలో 16 సీట్లు ఉన్న చంద్రబాబు స్పీకర్ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఏపీకి స్పెషల్ ఫైనాన్సియల్ ప్యాకేజీ, ఒకే కేంద్ర మంత్రి, రెండు సహాయక మంత్రులు కోరుతున్నట్లు తెలుస్తుంది. బాబు కోరికలను ఎన్డీయే తలొగ్గుతుందని తెలుస్తుంది. కానీ స్పీకర్ ఇవ్వడంపై కొంత అనుమానం ఉన్నా.. కేబినెట్, సహాయ మంత్రి పదవులు మాత్రం పెద్దగా ప్రాధాన్యత రంగాలకు ఇస్తారని తెలుస్తోంది. హోం, ఫైనాన్స్, రక్షణ, తదితర ముఖ్యమైన రంగాలు బీజేపీ తన వద్దనే ఉంచుకుంటుంది.

TAGS