Politicians : ఈ దీపావళి పేలిన రాజకీయ నాయకులు వీళ్లే..

politicians

politicians

politicians : దీపావళి పండుగ వచ్చేసింది. ఈ పండుగకు ప్రతి ఒక్కరు లక్ష్మీ దేవిని పూజించి అంతా మంచే జరగాలని కోరుకుంటారు. అలాగే ఇప్పటి నుంచి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతేడాది దీపావళి నుంచి ఈ పండుగ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ఎవరు బాగా పేలారు. ఎవరు తుస్సుమన్నారో చూద్దాం.

చంద్రబాబు : ప్రస్తుతం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా భూచక్రంలా చక్రం తిప్పుతున్నారు. ఆయన ప్రస్తుతం సూపర్ హిట్.
లోకేష్ : అధికారంలోకి వచ్చి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేష్ జెట్ స్పీడుతో రాకెట్ లా దూసుకుపోతున్నారు.
పవన్ కళ్యాణ్ : తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆటంబాంబులా పేలారు.
కేసీఆర్ : అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్ కే పాముబిల్లలా పరిమితం అయి అప్పడప్పుడు కనిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి : పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి లక్ష్మీబాంబులా పేలి సీఎం సీటును చేజిక్కించుకున్నారు.
కేటీఆర్ : అధికారం పోయినా ప్రజల పక్షాన్నే నిలబడి కొట్లాడుతానంటూ థౌజండ్ వాలాలా పేలుతున్నారు.
జగన్ : అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కాకరపుల్లలా చుర్రుమంటూ ఎగిరి పడుతున్నారు.
కొండా సురేఖ : అనవసర మాటలతో అందరి మధ్య చిచ్చులు పెట్టి కొండా సురేఖ చిచ్చుబుడ్డి అనిపించుకున్నారు.
హరీశ్ రావు : సమయం వస్తే చాలు ఉల్లిగడ్డ బాంబులా పేలుతూ.. తన మాటలకు పదును పెడుతున్నారు హరీశ్ రావు.
షర్మిల : ఇటీవల కాలంలో తన అన్న ఆస్తుల పంపకం సరిగా చేయడం లేదంటూ తాటాకు బాంబులా పేలుతున్నారు షర్మిల.
బండి సంజయ్ :  కేంద్రమంత్రి అయిన తర్వాత కొంత కాలం సైలెంట్ అయిపోయి రాష్ట్రంలో మళ్లీ సుతిల్ బాంబులా పేలుతున్నారు.

TAGS