Political Hat-Trick : రెండు సార్లకు మించి గెలిచిన నేతలు వీరే..!

Political Hat-Trick

Political Hat-Trick

Political Hat-Trick : ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రపంచలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. తమను పాలించే అర్హత ఎవరికి ఉంది? ఎవరి పాలనలో తాము చీకూ చింతా లేకుండా ఆనందంగా ఉంటామని ఆలోచించి ప్రజలు తమ నాయకులను ఎన్నుకుంటారు. ప్రతీ ఐదేళ్లకు ఒక సారి వచ్చే ఎన్నికలను పెద్ద పండుగగా నిర్వహించుకుంటారు. స్థానికంగా ఉండే వార్డు మెంబర్ నుంచి ఢిల్లీ పీఠంపై కూర్చునే ప్రధాని వరకు తమ నాయకుడిని ఎన్నుకున్నంటారు.

అలాంటి అతిగొప్ప విలువైన ప్రజాస్వామ్యంలో నాయకులు వరుసగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఒక సారి గెలిచిన నాయకుడు మరో సారి గెలవడం చాలా అరుదు. ఆయన చేసిన పనులు, ఆయన ఆలోచనలు అన్నింటినీ కూడా ఓటర్లు ఒడిసి పట్టుకొని మరీ గద్దెనెక్కిస్తారు. అలా రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు గెలవడం అంటే అంతా ఆషా మాషీ కాదు. ప్రజల మద్దతు చూరగొంటూ మూడు సార్లు (హ్యాట్రిక్) అంతకంటే ఎక్కువ సార్లు గెలిచిన నాయకులు ఎవరో చూద్దాం..

జవహర్ లాల్ నెహ్రూ..
భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వరుసగా మూడు సార్లు ప్రధాని పదవి చేపట్టారు. 1947లో స్వాతంత్రం అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో ఢిల్లీ పీఠంపై కూర్చుకున్న నెహ్రూ.. 1964 వరకు పాలించాడు. అంటే మూడు సార్లు ఆయన ప్రధాని పీఠం కూర్చుకున్నారన్నమాట.

ఇందిరాగాంధీ..
జవహర్ లాల్ కూతురు ఇందిరాగాంధీ 1966లో భారతదేశ మొదటి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. మూడు ఎన్నికల్లో గెలిచిన ఆమె మూడో సారి ప్రధాని పీఠం ఎక్కిన అనతికాలంలోనే దుండగుల కాల్పుల్లో మరణించింది. 1966 నుంచి 1977 వరకు, ఆ తర్వాత 1980 నుంచి 1989 వరకు పాలించింది.  

ప్రధాని నరేంద్ర మోడీ..
ప్రపంచానికి పెద్దన్నగా నిలిచే సత్తా ఒక్క భారత్ కు మాత్రమే ఉందని, అందుకు ఇక్కడి వనరులే ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. రెండు సార్లు (2014, 2018) గెలిచిన ఆయన మూడో సారి (2024) కూడా గెలువబోతున్నాడని ఎగ్జిట్ పోల్స్ బల్లగుద్ది మరీ చెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మూడోసారి (హ్యాట్రిక్) పీఎం కాబోతున్నాడు.

ఇక ముఖ్యమంత్రుల్లో..
1. వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ తరుఫున నిలబడి విజయం సాధించారు. వరుసగా 5 సార్లు విజయం సాధించి గొప్ప నేతగా ఎదిగారు. ఆయన 1977-2000 వరకు పని చేశాడు.
2. సిక్కిం రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం డెమొక్రెటిక్ ఫ్రెంట్ నుంచి గొలుపొంది వరుసగా నాలుగు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నారు. 1994 నుంచి 2019 వరకు ఆయన సీఎంగా సేవలిందించారు.
3. రాజస్తాన్ మోహన్ లాల్ సుఖాడియా ఇతడు కాంగ్రెస్ తరుఫున 1954 నుంచి 1971 వరకు పని చేశారు.
4. ఉత్తర ప్రదేశ్ కు చెందిన గోవింద బల్లబ్ పంత్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా నిలిచాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన 1937 నుంచి 1957 వరకు సీఎంగా పనిచేశారు.
5. త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ కమ్యూనిస్ట్ పార్టి ఆఫ్ మార్కిస్ట్ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ సీఎంగా నిలిచారు. 1998 నుంచి వరుసగా నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.
6. మధ్య ప్రదేశ్ కు చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ తరుఫున హ్యట్రిక్ విజయం సాధించారు. 2005 నుంచి మూడు సార్లు పీఠంపై కూర్చున్నారు.
7. ఛత్తీస్ ఘఢ్ కు చెందిన రమణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ తరుఫున హ్యాట్రిక్ సీఎంగా కొనసాగారు. 2003 నుంచి ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
8. మణిపూర్ సీఎంగా ఓక్రమ్ ఓబీబీ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన వరుసగా మూడు సార్లు సీఎం పీఠంపై కూర్చుకున్నారు. 2002 నుంచి మూడు సార్లు గెలుపొందారు.
9. గుజరాత్ కు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ. గుజరాత్ కు సీఎంగా మూడు దఫాలుగా పని చేశారు. 2002 నుంచి మూడు దఫాలుగా సీఎం పీఠంపై కూర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రధానిగా ఎన్నికయ్యారు.
10. అస్సాం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తరున్ గగోయ్, భీమల ప్రసాద్ చాలిహా ఇద్దరూ కూడా మూడు సార్లు పని చేశారు. తరుణ్ గగోయ్ 2001 నుంచి హ్యాట్రిక్ సీఎంగా నిలిస్తే, భీమల 1954 నుంచి 1970 వరకు పని చేశారు.
11. ఢిల్లీ సీఎం శీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ తరుఫున మూడు సార్లు సీఎంగా పని చేశారు. 1998 నుంచి 2008 వరకు ఆమె సీఎంగా ఉన్నారు.
12. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వసంత రావు నాయక్ హ్యాట్రిక్ సీఎంగా ఉన్నారు. 1963 నుంచి 1975 వరకు ఆయన పని చేశారు.
13. తమిళ్ నాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కే కామరాజు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1954 నుంచి 1963 వరకు ఆయన సీఎంగా ఉన్నారు.

హ్యాట్రిక్ కొట్టిన, కొట్టబోతున్న ఎమ్మెల్యేలు..
ఉమ్మడి రాష్ట్రం నుంచి చూసుకుంటే చాలా మంది నేతలు హ్యాట్రిక్ కొట్టారు. అంతకంటే ఎక్కువ సార్లు వరుసగా గెలిచి తమ రికార్డులను తామే బద్దు కొట్టారు. అందులో ప్రముఖుల గురించి తెలుసుకుందాం.
1. ఆంధ్రప్రదేశ్ లో కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు 1989 నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. 7 సార్లు గెలిచిన ఆయన 8వ సారి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నాడు.
2. పులి వెందుల నుంచి వైఎస్ జగన్ రెండు సార్లు మాత్రమే 2014 నుంచి 2019 నుంచి మాత్రమే ఎన్నికయ్యారు. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
3. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మొదటి సారి మాత్రమే పోటీ చేస్తున్నాడు.
4. కడప నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి రెండు సార్లు గెలిచారు. మూడో సారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
5. శ్రీకాకులం నుంచి కరంమోహన్ నాయుడు రెండు సార్లు విజయం సాధించాడు. మూడో సారి గెలిచే అవకాశాలు ఉన్నాయి.
రఘురామ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గణేశ్ కుమార్, శాంబశివరావు, అమ్జద్ బాషా, బాల వీరాంజనేయ స్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలకృష్ణ తదితరులు రెండు సార్లు విజయం సాధించి మూడో సారి హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. 

TAGS