Web series : తెలుగులో వివిధ ఓటీటీ ప్లాట్ ఫారాల్లో ఈ వారాంతంలో మొత్తం ఆరు సినిమాలు, నాలుగు వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. సంబంధిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్ వివరాలు, రిలీజ్ డేట్లు మీ కోసం..
1. లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ సీజన్ 2 : ది రింగ్స్ ఆఫ్ పవర్ – ఇంగ్లీష్ నుంచి తెలుగు వరకు, ఫాంటసీ అండ్ అడ్వెంచర్ వెబ్ సిరీస్, సీజన్ 2 ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. ప్రస్తుతం 3 ఎపీసోడ్లను రిలీజ్ చేశారు.
2. శివం భజే : అశ్విన్ బాబు నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
3. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ : చైతన్య రావు – హెబ్బా పటేల్ కలిసి నటించిన తెలుగు సినిమా హానీమూన్ ఎక్స్ ప్రెస్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రసారం చేసేందుకు అందుబాటులో ఉంది.
4. బడ్డీ : అశ్విన్ బాబు నటించిన యాక్షన్ కామెడీ చిత్రం బడ్డీ. ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
5. IC814 : కాందహార్ హైజాక్ : హిందీ నుంచి తెలుగు వరకు, యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ IC814 : కాందహార్ హైజాక్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. వాస్తవిక ఘటనలు ఉండడంతో భారీ వ్యూవ్స్ తో సాగుతుంది.
6. KAOS : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కోస్ ఇంగ్లీష్ నుంచి తెలుగు వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.
7. క్యాడెట్‌లు : హిందీ నుంచి తెలుగుకు బడ్ చేసిన క్యాడెట్లు యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
8. గాడ్జిల్లా x కాంగ్ : ది న్యూ ఎంపైర్: ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి డబ్ చేసిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమింగ్ లో ఉది.
9. పురుషోత్తముడు : రాజ్ తరుణ్ నటించిన తెలుగు సినిమా ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
10. ప్రభుత్వ జూనియర్ కళాశాల : తెలుగు టీనేజ్ డ్రామా చిత్రం ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆహా వీడియోలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
వీటితో పాటు మరిన్ని సినిమాలు, సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.