websites : గత నెలలో అత్యధికంగా చూసిన వెబ్ సైట్స్ ఇవే
Top websites : నేటి పోటి ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఏదో ఒక యాప్‌లు, వెబ్‌సైట్లను ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో 2024 ఆగస్టు నెలలో ఇండియాలో అత్యధికంగా చూసిన వెబ్‌సైట్ల వివరాలను సిమిలర్ వెబ్ విడుదల చేసింది.
ఈ ఏడాది ఆగస్టు నెలలో భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్‌ల గురించి ఒక నివేదిక విడుదలైంది. నివేదిక ప్రకారం, గూగుల్ మొదటి స్థానంలో ఉంది. యూట్యూబ్ రెండో స్థానంలో ఉండగా, ఎక్స్ హమ్‌స్టర్ మూడో స్థానంలో, ఇన్‌స్టాగ్రామ్ నాలుగో స్థానంలో, ఫేస్‌బుక్ ఐదో స్థానంలో ఉన్నాయి ఇక గ్లోబల్ వైడ్‌గానూ 83.5 బిలియన్ విజిట్స్‌తో గూగుల్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, x.com, వాట్సాప్ ఉన్నాయి. దీనితో పాటు, శామ్సంగ్, వాట్సాప్, క్రిక్‌బజ్, ట్విట్టర్ ఉన్నాయి, చివరి స్థానంలో అమెజాన్ పదో స్థానంలో ఉంది. అంటే ఈ పది వెబ్‌సైట్లలో అమెజాన్ వెబ్‌సైట్ అతి తక్కువ సందర్శించినది.
దీంట్లో దిగ్భ్రాంతికర విషయం ఏంటంటే.. భారత్‌లో పోర్న్ వెబ్ సైట్ చూసే వారి సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్‌ల తర్వాత ఈ వెబ్‌సైట్‌ను అత్యధికంగా చూస్తున్న మూడో పెద్ద దేశం భారత్. ఇక్కడ పోర్న్‌హబ్‌లో వీడియోలను ఎక్కువగా మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారు. చౌకగా స్మార్ట్‌ఫోన్లు, డేటా అందుబాటులోకి రావడంతో భారత్‌లో అశ్లీల వీడియోలు చూడటం సులభమైంది. చాలామంది భారతీయ యువకులకు అశ్లీల వీడియోలు చూడడంద్వారానే మొదటిసారి సెక్స్‌తో పరిచయం ఏర్పడుతోంది. మనిషిలోని కుతూహలానికి అవి సమాధానాలు ఇవ్వగలిగినా, అవి వ్యక్తులను అయోమయంలో కూడా పడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నిపుణులతో తయారు చేయించిన పోర్న్ వీడియోలు, పిల్లలతో నీలి చిత్రాలు, ప్రతీకార నీలిచిత్రాలు, అత్యాచార వీడియోలు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయి.