Web Series : 2024 ఫస్ట్ ఆఫ్ లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఇవే.. అందులో టాప్ 15కు ఎన్ని వ్యూవ్స్ వచ్చాయంటే?
Web Series : కొన్నేళ్లుగా వెబ్ సిరీస్ లు విపరీతంగా పాపులర్ అయ్యాయి. ప్రతిసారీ కొత్త ఎపిసోడ్స్ విడుదల కోసం వ్యూవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వెబ్ సిరీస్, షోల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, జీ5, జియో సినిమా వంటి టాప్ స్ట్రీమింగ్ సర్వీసులు ఉన్నాయి. 2024కి సంబంధించి చాలా షోలకు మంచి ఆదరణ లభించగా, కొన్ని ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాయి.
ట్రాకింగ్ వెబ్ సైట్ ఓర్ మాక్స్ ప్రకారం.. పంచాయితీ సీజన్ 3 అత్యధిక మంది వీక్షించిన హిందీ వెబ్ సిరీస్ గా నిలిచింది. తర్వాత హీరామండి, కోటా ఫ్యాక్టరీ S3 ఉన్నాయి. ఇవి రెండూ ఎక్కువ మంది వ్యూవర్స్ ను ఆకట్టుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన పంచాయితీ సీజన్ 3, మొత్తంగా భారతదేశంలో అత్యధిక మంది వీక్షించిన షోతో పాటు హిందీలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. జూన్ 30 వరకు టీవీఎఫ్ ప్రొడక్షన్ 28.2 మిలియన్ వ్యూస్ సాధించింది.
2024 ప్రథమార్థంలో అత్యధికంగా వీక్షించిన 15 వెబ్ సిరీస్ లు
* పంచాయితీ S3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) – 28.2 మిలియన్ వ్యూస్
* హీరామండి (నెట్ ఫ్లిక్స్) – 20.3 మిలియన్ వ్యూస్
* ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) – 19.5 మిలియన్ వ్యూస్
* కోట ఫ్యాక్టరీ S3 (నెట్ ఫ్లిక్స్) – 15.7 మిలియన్ వ్యూస్
* ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఎస్3/ఎస్4 (డిస్నీ+ హాట్ స్టార్) – 14.8 మిలియన్ వ్యూస్
* షో టైమ్ (డిస్నీ+ హాట్ స్టార్) – 12.5 మిలియన్ వ్యూస్
* గుల్లక్ S4 (సోనీ లివ్) – 12.1 మిలియన్ వ్యూస్
* మహారాణి S3 (సోనీ లివ్) – 10.2 మిలియన్ వ్యూస్
* కిల్లర్ సూప్ (నెట్ ఫ్లిక్స్) – 9.2 మిలియన్ వ్యూస్
* జామ్నాపర్ (అమెజాన్ మినీటీవీ) – 9.2 మిలియన్ వ్యూస్
* కర్మ కాలింగ్ (డిస్నీ+ హాట్ స్టార్) – 9.1 మిలియన్ వ్యూస్
* రైసంఘాని వర్సెస్ రైసంఘాని (సోనీ లివ్) – 8.5 మిలియన్ వ్యూస్
* మామ్లా లీగల్ హై (నెట్ ఫ్లిక్స్) – 8.1 మిలియన్ వ్యూస్
* బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (డిస్నీ+ హాట్ స్టార్) – 8.0 మిలియన్ వ్యూస్
* లూటేర్ (డిస్నీ+ హాట్ స్టార్) – 8.0 మిలియన్ వ్యూస్