Islands in India : మనదేశంలో కూడా పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటికి సరైన ఆదరణ లేక వెలుగులోకి రావడం లేదు. అండమాన్ బీచ్ లోని హవెలాక్ బీచ్ లో సూర్యాస్తమయం ఎంతో అందంగా ఉంటుంది. స్కూబా డ్రైవింగ్, ట్రెక్కింగ్ వంటివి ఇక్కడ ఉండటం విశేషం. అస్సాంలో ఉన్న మజులి ఐలాండ్ ఎంతో విశాలమైనది, పొడవైనది కావడం గమనార్హం.
ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రదేశం లక్ష్యద్వీప్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యద్వీప్ ను పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయాలని సూచించిన విషయం తెలిసిందే. 36 ద్వీపాల సముదాయం కావడంతో ఇది మంచి పర్యాటక ప్రాంతం. కేరళకు దగ్గరలో ఉన్న ఇక్కడ మనకు అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి. కవరత్తి ద్వీపం, మెరైన్ అక్వేరియం, మినీకాయ్ ప్రముఖంగా చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.
అండమాన్ దీవిలో ఉన్న మరో అద్భుతమైన ప్రాంతం బారెన్ ఐలాండ్. ఎలిఫెంట్, కాలా పత్తర్, రాధానగర్ బీచ్ లు అందంగా కనిపిస్తాయి. ఫిబ్రవరి-మే నెలల్లో వీటిని చూడటం మంచిది. స్కూబా డ్రైవింగ్, రోమ్ ఆన్ బీచెస్, వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. మున్రో ఐలాండ్ కూడా మరో అందమైన ప్రాంతం. తెన్ మల, ఎంజీ బీచ్, జటాయువు రాక్స్, వర్కల బీచ్, చర్వా, షెన్ దుర్ని, వైల్డ్ లైఫ్, పలరువి, వాటర్ ఫాల్స్ చూడదగిన ప్రదేశాలు.
డయ్యూ ఐలాండ్ కూడా సుందరమైన ప్రాంతం. ఇక్కడ కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. పోర్చుగీసు సంప్రదాయం కనిపిస్తుంది. కర్ణాటకలో ఉన్న సెయింట్ మేరీ ఐలాండ్ బాగుంటుంది. కొబ్బరి తోటలు, రాతి నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడకెళ్తే మనకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ముంబైలో ఎలిఫెంట్ ఐలాండ్ ఉంటుంది. ప్రాచీన భారతదేశంలో ఉన్న ఆర్కిటెక్చర్ ఇక్కడ కనిపిస్తుంది.