Adventure Train Routes : భారత్ లో మోస్ట్ అడ్వెంచర్ ట్రైన్ రూట్స్ ఇవే..
Adventure Train Routes : భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్ వర్క్ లలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా ప్రజలను కలుపుతోంది. దేశంలోని మనోహర దృశ్యాలను, సాహసోపేతమైన రూట్లను కలిగి ఉంది. దేశంలోని కొన్ని రైలు మార్గాల్లో ప్రయాణించడం అపురూపమైన అనుభూతిని కలుగజేస్తుంది. ఇందుకోసం దేశీయ, విదేశీయ టూరిస్టులు వీటిలో ప్రయాణించేందుకు మక్కువ చూపుతుంటారు. వాటిలో కొన్ని ట్రైన్ రూట్ల గురించి తెలుసుకుందాం..
వాస్కోడిగామా నుంచి లోండా:
గోవాలోని వాస్కోడిగామా నుంచి బయలుదేరే ఈ రైలు కర్ణాటకలోని లోండాకు చేరుకుంటుంది. జలపాతాల నుంచి పర్వతాలు, దట్టమైన పచ్చని అడువుల వరకు ఈ ప్రయాణం ఎంతో అనుభూతిని పంచుతుంది.
జోథ్ పూర్ టు జైసల్మీర్:
ఈ రూట్ ను ఎడారి రాణి అంటారు. డెసెర్ట్ క్వీన్ రైలు మార్గం మొత్తం ఎడారిలోనే ఉంటుంది. జోథ్ పూర్ టు జైసల్మీర్ కు వెళ్లే ఈ మార్గంలో ఎడారి భూమి, ఇసుక దిబ్బలు, ఎడారి వన్యప్రాణులు అందాలను పంచుతుంది. అలాగే ఎడారి తెగల జీవన విధానం మనకు తెలుస్తుంది. థార్ ఎడారిలోని పొడి అడవి, వ్యర్థ భూమి గుండా ఈ రూట్ సాగుతుంది.
న్యూ జల్పాయ్ గురి టు డార్జిలింగ్:
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో దీనికి చోటు దక్కింది. నారో గేజ్ రైల్వే ట్రాక్ లో ఆనందంగా ప్రయాణించడానికి డార్జిలింగ్ ను సందర్శించడానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వస్తారు. టాయ్ ట్రైన్ అందమైన పర్వతాల మీదుగా నడుస్తుంది. కాంచనజంగా పర్వత అందాలను మనకు చూపిస్తుంది.
కల్కా టు సిమ్లా:
ఈ అద్భుతమైన ప్రయాణం దాదాపు ఐదు గంట పాటు సాగుతుంది. సిమ్లా చేరుకోవడానికి ముందు 20 రైల్వే స్టేషన్లు, 800 వంతెనలు, 103 సొరంగాలు, 900 వంపుల గుండాల సాగే అత్యంత సుందరమైన యాత్ర ఇది.
సేతు ఎక్స్ ప్రెస్:
థ్రిల్ మరియు అడ్వెంచర్ తో నిండిన భారత్ లోని అత్యంత అందమైన రైలు మార్గాలలో ఒకటి. మండపం నుంచి రామేశ్వరం మీదుగా వెళ్తుంది. ఈ రైలు మార్గం సముద్రం మీద నిర్మించిన బ్రిడ్జిపై రైలు నడుస్తుంది కాబట్టి చాలా ప్రమాదకరమైనది. అయితే దాని గుండా వెళ్తున్నప్పుడు సముద్ర సౌందర్యాన్ని అందించే ఏకైక రైలు మార్గం ఇది.