Team India : టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా ఇప్పటికే మూడు మ్యాచులు గెలిచి ఊపు మీద ఉంది. కానీ కెనడాతో జరగాల్సిన గ్రూపు ఏ లోని ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు కావడంతో చెరో పాయింట్ కేటాయించారు. దీంతో టీం ఇండియా 7 పాయింట్లతో గ్రూపు ఏ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచి సూపర్ 8 కు అర్హత సాధించింది.
వర్షం కారణంగా కెనడా మ్యాచ్ రద్దు కావడంతో డైరెక్టుగా సూపర్ 8 మ్యాచ్ ఆడేందుకు భారత క్రికెటర్లు వెస్టిండీస్ పయనమయ్యారు. బార్బడోస్ వేదికగా జూన్ 20 వ తేదీన అఫ్గానిస్తాన్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది. జూన్ 22 వ తేదీన బంగ్లాదేశ్ తో.. 24 న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇందులో టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి.
మరో గ్రూపులో వెస్టిండీస్, ఇంగ్లాండ్, యూఎస్ఏ, సౌతాఫ్రికాల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే రెండు గ్రూపుల్లో టాప్ 2 స్థానంలో నిలిచిన జట్లు సెమీస్ లో తలపడతాయి. సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. ఇప్పటి వరకు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఫేవరేట్ గా కనిపిస్తుండగా.. బంగ్లాదేశ్ ఐసీసీ టోర్నీలు ఇంత వరకు గెలవలేదు.
సౌతాఫ్రికా కూడా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఇంత వరకు గెలవలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది. యూఎస్ఏ సెమీస్ చేరితే అదే విజయంగా భావిస్తుంది. ఇంగ్లండ్ డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగగా.. కష్టపడి సూపర్ 8కు అర్హత సాధించింది. అయితే ఇంగ్లండ్ నాకౌట్ గేమ్స్ లో చాలా బాగా ఆడే అవకాశం ఉంది. రాబోయే సూపర్ 8 మ్యాచులు మరింత ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. టఫ్ టీం ల మధ్య హోరాహోరా పోరు సాగడం ఖాయం కాగా.. ఈ టోర్నీలో పాకిస్థాన్, న్యూజిలాండ్, లాంటి అగ్రశ్రేణి టీంలు గ్రూపు దశలోనే ఇంటి బాట పట్టడంతో ఆ దేశ అభిమానులు మండిపడుతున్నారు.