Majority Candidates : ఏపీలో భారీ మెజారిటీతో గెలిచిన నాయకులు వీరే..

Majority Candidates

AP Candidates with Huge Majority

Majority Candidates : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పూర్తి ఘట్టం నిన్నటి (జూన్ 4) లెక్కింపుతో ముగిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీ సాధించాయి. ఐదేళ్లు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అయితే తాము చేసిన తప్పొప్పులపై నాయకులు, సీనియర్ స్థాయి నేతలు పోస్ట్ మార్టన్ నిర్వహించుకుంటున్నారు.

ఎక్కడెక్కడ ఏఏ తప్పిదాలు చేయడం వల్ల కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని వైసీపీ విచారిస్తోంది. కౌంటింగ్ ఘట్టం నడుస్తుండగానే వైఎస్ జగన్ గవర్నర్ ప్రెస్ మీట్ పెట్టారు. కన్నీటితో ఆయన తమకు వచ్చే ఓట్లు ఎటు వెళ్లాయంటూ మదన పడ్డారు. నవరత్నాలు మమ్ములను గెలిపించలేకపోయాయని వాపోయారు. తమ పార్టీకి చెందిన మంత్రి స్థాయి నాయకులు కూడా ఓడిపోవడంతో జగన్ తీవ్రంగా కుంగిపోయినట్లు కనిపిస్తుంది.

ఏఏ నేత ఎంత మెజారిటీతో విజయం సాధించారో ఇక్కడ చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ రావు అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందగా.. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీలో కూడా అట్టడుగుకు పడిపోవడం వైసీపీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపై మరింత లోతుగా పరిశీలించాలని అనుకుంటున్నారు.

ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం మాత్రం అత్యంత భారీ మెజారిటీతో భారీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. చంద్రబాబు సీఎంగా ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పటికే చెప్పగా.. గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ హోదా వస్తుందని అంతా అనుకుంటున్నారు. 

TAGS