Pakistani films : పాకిస్తాన్ చిత్రాల్లోనూ అదరగొట్టిన భారతీయ నటులు వీరే

Pakistani films

Pakistani films

Pakistani films : ఇప్పటి దాకా భారతీయ చిత్రాల్లో నటించిన పాకిస్తాన్ నటీనటుల గురించే మనకు తెలుసు. కానీ భారతీయ నటులు కూడా పాకిస్తాన్ చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పుపొందారు. ఈ భారతీయ నటులను పాకిస్తానీలు ఎంతగానో ప్రేమిస్తున్నారు కూడా. మరి వారెవరో తెలుసుకుందాం.

బాలీవుడ్ సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది అహ్సన్ ఖాన్. ఈ నటి 2014లో ‘సుల్తానాత్’ అనే పాకిస్థానీ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ చిత్రంలో ‘పరి’ అనే కీలక పాత్ర పోషించింది. కిరణ్ ఖేర్ కూడా బాలీవుడ్‌లో ప్రఖ్యాత నటి. ఎన్నో విలక్షణ పాత్రలు చేసి మెప్పించారు. ‘సర్దారీ బేగం’, ‘దేవదాస్’, ‘మై హూ నా’, ‘దోస్తానా’, ‘సింగ్ ఈజ్ కింగ్’ వంటి పలు చిత్రాలతో బీ-టౌన్‌లో గుర్తింపు తెచ్చుకున్నది. 2003లో ‘ఖామోష్ పానీ’ అనే పాకిస్థానీ చిత్రంలో నటించారు కిరణ్ ఖేర్.  అందులో పాకిస్థానీ వితంతువు పాత్ర చేసి మెప్పించారు. అవార్డుల సైతం అందుకున్నారు.

ప్రముఖ స్టార్ యాక్టర్ నసీరుద్దీన్ షా బాలీవుడ్ తో పాటు పాకిస్తాన్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. 2007లో ‘ఖుదా కే లియే’ అనే పాకిస్తానీ చిత్రంలో నటించారు. ఇందులో ఫవాద్ ఖాన్, షాన్ షాహిద్,  ఇమాన్ అలీ కూడా నటించారు. అలాగే 2013లో ‘జిందా భాగ్’ అనే మరో పాకిస్తానీ చిత్రంలో నటించగా, అది బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.
బాలీవుడ్ తో పాటు ప్రాంతీయ భాషల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరుగాంచిన ఓం పూరి కూడా పాకిస్తానీ చిత్రాలు చేశాడు. అక్కడ రెండు సార్లు జాతీయ అవార్డులు కూడా పొందాడు. 2016 లో ‘యాక్టర్ ఇన్ లా’ అనే పాకిస్తానీ చిత్రంలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు.

పెషావర్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన వినోద్ ఖన్నా స్టార్ హీరోగా బాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఏలాడు. 2007లో వినోద్ ఖన్నా పాకిస్థాన్ ఉర్దూ చిత్రం ‘గాడ్ ఫాదర్: ది లెజెండ్ కంటిన్యూస్’లో నటించి మెప్పించాడు.

మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా 2003లో ‘ఖయామత్: సిటీ అండర్ థ్రెట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జూలీ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసి బాలీవుడ్ లో స్టార్ హీరోయినగా ఎదిగింది. నేహా కూడా పాకిస్థానీ చిత్రం ‘కభీ ప్యార్ నా కర్నా’లో నటించింది. ఇందులో వీణా మాలిక్, జరా షేక్,  ముఅమ్మర్ రానా కూడా నటించారు.
బాలీవుడ్ స్టార్ కమెడియన్ జానీ లివర్ కామిక్ టైమింగ్‌కు ప్రసిద్ధి, బాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. జానీ కూడా పాకిస్తానీ సినిమాల్లో నటించాడు. 2010లో జానీ లీవర్ ‘లవ్ మే ఘమ్’ అనే పాకిస్తానీ సినిమాలో నటించాడు. ఇందులో పాకిస్థానీ స్టార్లు ముయమ్మర్ రానా మరియు రీమా ఖాన్ నటించారు.
సారా ఖాన్ ‘బిదాయి’  అనే హిందీ సీరియల్ తో మహిళా ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆ తర్వాత ‘ససురల్ సిమర్ కా’లో కూడా నటించింది. ‘బిగ్ బాస్’లో కూడా నటించింది. ఈ నటి 2016 లో ‘బే ఖుదీ’ అనే పాకిస్తానీ టీవీ షో చేసింది. 2017లో  ‘లైక్’లో కూడా కనిపించింది.

బాలీవుడ్ మూవీ  ‘దారార్’లో విలన్ పాత్రతో కెరీర్ ప్రారంభించిన అర్బాజ్ ఖాన్ కూడా పాకిస్థానీ సినిమాలో కూడా పనిచేశాడు. ‘ప్యార్ కియా తో డర్నా క్యా’, ‘మలామాల్ వీక్లీ’, ‘దబాంగ్’చిత్రాలతో ఫేమస్ అయిన అర్బాజ్ ఖాన్  పాకిస్తానీ మూవీ ‘గాడ్‌ఫాదర్: ది లెజెండ్ కంటిన్యూస్’ చిత్రంలో నటించాడు. ఇందులో ‘షకీర్ ఖాన్’ అనే పాత్రలో నటించాడు.

TAGS