Chandrababu Book : ఎన్నికల వేళ చంద్రబాబు పుస్తకం ‘మహాస్వాప్నికుడు’ సంచలనం హైలైట్స్ ఇవే!!
Chandrababu Book : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రజాక్షేత్రం లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ సారి జగన్ ను గద్దె దించడం లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబా బు పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలలో చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్న వేళ టిడిపి అధినేత చంద్రబాబు జీవిత విశేషాలతో “మహా స్వాప్నికుడు” పుస్తకాన్ని ఆవిష్కరించి, ఈ పుస్తకాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది టిడిపి. చంద్రబా బు జీవితవిశేషాలతో పాటు, ఆయన దూరదృష్టి, పాలన వంటి కీలక అంశాలపై సీనియర్ జర్నలిస్టు పూల విక్రమ్ రచించిన ‘మహా స్వాప్నికుడు’ పుస్త కాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ ఆవిష్కరించారు.
ఈ పుస్తకాన్ని 50 లక్షల రూపాయల ఖర్చుతో కువైట్ లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ప్రచురించారు. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, సీఎంగా ఆయన పాలన తీరు, రాజకీయంగా ఆయన ఎదిగిన తీరు, చంద్రబాబు వ్యక్తిగత జీవితంతో పాటు, భవిష్యత్తు తరాల గురించి ఆయన ఆలోచించిన తీరు పైన క్షుణ్ణంగా వివరించారు.
చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతో మొద లుపె ట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ విధం గా తీర్చిదిద్దాలని భావించాడు అనే అంశాలను పేర్కొ న్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను, తప్పుడు కేసు లు పెట్టి ఆయనను జైలుకు పంపిన పరిస్థితులను, అయినప్పటికీ మొక్కవోని దీక్షతో చంద్రబాబు సాగిస్తున్న పోరాటాన్ని వివరించారు.