JAISW News Telugu

increase fertility : పిల్లలు లేనివారిలో సంతానోత్పత్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే !

increase fertility

increase fertility

increase fertility Food : ఓ జంట గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న లేదా గర్భం దాల్చడానికి వారి చేస్తున్న ప్రయత్నాలు పదేపదే విఫలమవుతున్నట్లయితే భార్యభర్తలిద్దరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  పౌష్టికాహారం ఆహారం,  వ్యాయామం పురుషుల్లో శుక్రకణాల నాణ్యతను పెంచుతుంది. సంతానోత్పత్తికి దోహదపడుతుంది. భార్య గర్భం దాల్చాలంటే భర్త కూడా తన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని సాధారణ మార్పులు చేయడం ద్వారా మగవారిలో వీర్యోత్పత్తి, వీర్యం నాణ్యతను మెరుగుపరచవచ్చు.

ప్రోటీన్ ఫుడ్
లీన్ మాంసం, గుడ్లు, పప్పులు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. భోజనంలో తప్పనిసరిగా ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి. వారానికి రెండుసార్లు తప్పనిసరిగా చేపలు తినాలి, సెమీ స్కిమ్డ్ మిల్క్, పెరుగు,  చీజ్ లేదా కాల్షియం ఫోర్టిఫైడ్ డైరీ ఉత్పత్తులను కూడా తీసుకోవచ్చు. కొన్ని పాల ఉత్పత్తులలో సంతృప్త కొవ్వు, ఉప్పు,  చక్కెర ఎక్కువగా ఉంటాయి. వాటిని నియంత్రిస్తే మేలు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం శుక్ర కణాల అభివృద్ధికి మేలు చేస్తుంది. చేపలు, తృణధాన్యాలు, వాల్‌నట్‌లు, అవిసె గింజలు,  రాప్‌సీడ్ నూనెలో ఈ పోషకం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి సంతృప్త కొవ్వులను తీసుకోకూడదు.

జింక్..
గర్భం దాల్చడంలో జింక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో తగినంత జింక్ ఉండేలా చూసుకోవాలి. ప్రతి స్ఖలనంలో స్పెర్మ్ సంఖ్యను పెంచడంలో జింక్ సహాయపడుతుంది. మాంసం, పాల ఉత్పత్తులు, రొట్టెలు,  ధాన్యాలలో జింక్ అధికంగా ఉంటుంది.
ఎన్ సీబీఐ  ప్రకారం కాబోయే తండ్రి యొక్క సంతానోత్పత్తికి లేదా డీఎన్ ఏ కి కెఫీన్ హాని చేస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కోలాస్,  ఎనర్జీ డ్రింక్స్ వంటి అనేక కెఫిన్ పానీయాలు కూడా చాలా చక్కెరను కలిగి ఉంటాయి. తండ్రి కావాలనుకునే వారు వాటికి కాస్త దూరంగా ఉండడం మేలు.

Exit mobile version