JAISW News Telugu

Economic Recession : ఆర్థిక మాంద్యంతో స్టోర్లు మూసేసిన ప్రముఖ సంస్థలు ఇవే?

Economic Recession

Economic Recession

Economic Recession : కొవిడ్-19 తర్వాత నుంచి యావత్ ప్రపంచం కష్టాల్లో మునిగిపోయింది. ఆర్థిక మాంధ్యం దెబ్బతో కంపెనీలు, సంస్థలు పేక మేడల్లా కుప్ప కూలాయి. ఎన్నో కొన్ని కంపెనీలు మాత్రం ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూ నిలదొక్కుకోగలిగాయి. సాక్షాత్తు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా చాలా సార్లు వారి బాధపడుతూ ఎంప్లాయీస్ ను వదుకోవాల్సి వచ్చింది. గత రెండు నెలల క్రితం కూడా కొందరిని తొలగించాల్సి వచ్చింది.

ప్రపంచాన్ని ఏలే అంత పెద్ద సంస్థనే ఇలా ఇబ్బంది పడితే.. సాధారణ కంపెనీలు, సంస్థల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్ మొదలై టెక్ దిగ్గజాలు ఆఫీస్ మెయింటెనెన్స్ ను తగ్గించుకుని బతికిపోయాయి. లేదంటే మరింత ఇబ్బంది పడాల్సి వచ్చేది. కరోనా మొత్తం పోయినా ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం కొనసాగుతూనే ఉంది. ఆఫీసులకు రావాలంటే ఎంప్లాయీస్ ఇష్టం చూపడం లేదు. అందుకే ఒక్క సారిగా కాకుండా దశల వారీగా రావాలని హుకుంలు జారీ చేస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం దెబ్బకు చాలా కంపెనీలు తమ ఎంప్లాయీస్ ను తొలగిస్తున్నాయి. ఇంకా కొన్ని చోట్లు కంపెనీలు వారి బ్రాంచ్ లను మూసి వేస్తున్నాయి.

*‘డాలర్ ట్రీ’ (DOLLAR TREE) అనేది అమెరికాలోని డిస్కౌంట్ వెరైటీ స్టోర్ల యొక్క అమెరికన్ మల్టీ-ప్రైస్ పాయింట్ చైన్. ఇది తన 1000 స్టోర్లను మూసివేసింది.

* 123 సంవత్సరాల చరిత్ర కలిగిన ‘వాల్‌గ్రీన్స్ (WALGRENS)’ అనేది ఒక అమెరికన్ కంపెనీ. ఇది CVS హెల్త్ తర్వాత యునైటెడ్ స్టేట్స్‌లో రెండో అతిపెద్ద ఫార్మసీ స్టోర్ చెయిన్‌ను నిర్వహిస్తోంది. ఇది తన 900 స్టోర్లను మూసి వేసింది.

* 165 సంవత్సరాల చరిత్ర కలిగిన స్టోర్ మైసీస్ (Macy’s). రోలాండ్ హస్సీ 1858లో దీన్ని స్థాపించారు. ఇది తన 150 స్టోర్లను మూసి వేసింది.

* ఫుట్ లాకర్ (FOOT LOCKER) ఒక అమెరికన్ స్పోర్ట్స్ క్లాత్స్, పాదరక్షలు, రిటైలర్. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లో ఉంది. 40కి పైగా దేశాల్లో దాని కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది తన 400 స్టోర్లను మూసి వేసింది.

* గ్యాప్ (GAP) ఇది క్లాత్స్ అండ్ ఉపకరణాల రిటైలర్. అమెరికాలో 1969లో డోనాల్డ్ ఫిషర్ మరియు డోరిస్ ఎఫ్ ఫిషర్ దీన్ని స్థాపించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగ సేవలందిస్తుంది. ఇది 350 స్టోర్లను మూసి వేసింది.

* ప్రముఖ ఫుడ్ స్టోర్ ‘బర్గర్ కింగ్’ (BURGER KING). 1954 లో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, మయామిలో దీన్ని ప్రారంభించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది విస్తరించి ఉంది. ఈ సంస్థ తన 400 స్టోర్లను మూసి వేసింది.

* టేనస్సీలోని నాక్స్‌విల్లేలో ప్రధాన కార్యాలయం ఉన్న ‘రీగల్ సినిమాస్’ (REGAL CINEMAS) ఒక అమెరికన్ సినిమా థియేటర్ చైన్. ఇది తన 429 లొకేషన్లను మూసి వేసింది.

* క్రోగర్ (KROGER) అనేది యూఎస్ మొత్తం సూపర్ మార్కెట్లు, బహుళ-డిపార్ట్‌మెంట్ స్టోర్లను నిర్వహించే అమెరికన్ రిటైల్ కంపెనీ. ఇది తన 413 స్టోర్లను మూసి వేసింది. 

Exit mobile version