BJP Leaders : ఓటమి పాలైన బీజేపీ ప్రముఖులు వీరే!

BJP Leaders

BJP Leaders

BJP Leaders : గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి బీజేపీ 60కి పైగా సీట్లను కోల్పోయింది. దీంతో ప్రభుత్వా్న్నయితే ఏర్పాటు చేస్తారు కానీ భాగస్వామ్య పక్షాలు అటు ఇటుగా వ్యవహరిస్తే ప్రభుత్వం కూలిపోతుంది. పైగా దేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో మిత్ర పక్షాలు కలిసి వస్తాయా? అన్న సందేహం కూడా ఉంటుంది. బీజేపీ నుంచి ఫేమస్ పర్సన్స్ ఈ సారి ఓటమి పాలయ్యారు.

హైదరాబాద్‌లో మాధవి లత
తెలంగాణలోని హైదరాబాద్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సంస్కృతిక కార్యకర్త, పారిశ్రామికవేత్త, సోషలిస్ట్ మాధవీ లత పోటీ చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా మాధవీ లతను రంగంలోకి దింపింది.

పాత బస్తీలో తీవ్రంగా ప్రచారం చేసింది. గతంలో ఏ హిందూ నాయకుడు, నాయకురాలు వెళ్లని ప్రదేశాలకు వెళ్లి మరీ ప్రచారం చేసింది. కానీ ఓట్లను రాబట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. ఎన్నికల్లో ఆమెకు 3,23,894 ఓట్లు రాగా, ఒవైసీకి 6,61,981 ఓట్లు వచ్చాయి. 3,38,000 ఓట్ల తేడాతో మాధవీ లత ఓటమి పాలైంది.

తమిళనాడులో అన్నామలై..
‘ఎన్ మన్ ఎన్ మక్కల్’తో విపరీతమన జనాధరణ సంపాదించుకున్న అన్నామలై. వాటిని ఓట్లుగా ట్రాన్స్ ఫర్ చేసుకోవడంలో విఫలం అయ్యాడు. పాదయాత్ర సమయంలో వచ్చిన ఆదరణను చూసిన ఇతర రాష్ట్రాల ప్రజలు తమిళనాడు బీజేపీకి అన్నామలై ఆశాదీపం అనుకున్నారు. ఈ సారి తమిళనాడులో బీజేపీ పాగా వేస్తుందని పార్టీ నేతలు కలలు కన్నారు. కానీ ఫలితాలు నిరాశకు గురి చేశాయి.

బీజేపీ నేత అన్నామలైపై డీఎంకే నేత గణపతి రాజ్‌కుమార్‌ పోటీ చేశారు.  అన్నామలై 59,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి పైచేయి సాధించడంతో తమిళనాడు సీటు ఆశలు గల్లంతయ్యాయి.  అన్నామలై బీజేపీని బకరా చేశాడని మద్దతుదారులు భావిస్తున్నారు.

అమేథీలో స్మృతి ఇరానీకి ఎదురుదెబ్బ
బీజేపీలో మరో ప్రముఖ నేత స్మృతి ఇరానీ రెండో సారి అమేథీ నుంచి పోటీ చేసింది. అయితే, ఎన్నికల ఫలితాలు మాత్రం ఆమె గెలుపునకు గండి కొట్టాయి. ఇరానీ తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ నాయకుడు కేఎల్ శర్మ (రాజీవ్ చంద్రశేఖర్) చేతిలో ఓటమి పాలయ్యారు. కేఎల్ శర్మ కాంగ్రెస్ కార్యాలయంలో ప్యూన్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. రాహుల్, ప్రియాంక ఆయనకు లోక్ సభ టికెట్ ఇచ్చారు. స్మృతి ఇరానీపై కెఎల్ శర్మ 1,67,196 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 

TAGS