Celebrities Divorce : బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా సెలబ్రెటీ జంటలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. తాజాగా హర్దిక్ పాండ్యా, నటాషా దంపతులు నాలుగేళ్ల తమ వివాహా బంధానికి ముగింపు పలికారు. 2024 మొదలై 7 నెలల్లో ఇప్పటి వరకు ఐదు సెలబ్రెటీ జంటలు తమ బంధాలకు దూరం అయ్యాయి. హేమమాలిని, ధర్మేంద్రల కూతురు ఈషా డియోల్ తన భర్త భరత్ తఖ్తానీ తో డైవర్స్ తీసుకుంది. వీరిద్దరూ 2012 సంవత్సరంలో పెళ్లి చేసుకోగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరి 12 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలికారు.
చంద్రలేఖ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన నటి ఇషా కొప్పికర్ వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ ను 2009 లో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉండగా.. విడిపోతున్నట్లు ప్రకటించారు. బుల్లితెర నటి దల్జీత్ కౌర్ ఆమె రెండో భర్త నిఖిల్ పటేల్ కెన్యాలో సెటిల్ అయింది. దల్జీత్ కౌర్.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చి తర్వాత తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది.
బాలీవుడ్ లో సీనియర్ హిరోయిన్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరు లవ్ బర్డ్స్ గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ చివరకు వారు ఈ ఏడాదిలోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. అర్జున్ కపూర్ కంటే మలైకా అరోరా వయసులో చాలా పెద్దది. కాగా ఈ మధ్య అర్జున్ పుట్టిన రోజు వేడుకల్లో మలైకా పాల్గొనలేదు.
తాజాగా క్రికెటర్ హర్దిక్ పాండ్యా, హిరోయిన్ నటాషా స్టాంకోవిచ్ ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వివాహా బంధానికి తెగదెంపులు చేసుకున్నారు. తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరారు. వీరిద్దరికీ ఆగస్త్య అనే కొడుకు జన్మించాడు. ప్రస్తుతం నటాషా సంరక్షణలోనే ఆగస్త్య ఉండనున్నాడు. దీంతో ఈ సంవత్సరం మొత్తం విడాకులు తీసుకున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటయిన జంటలు కూడా ఉండగా.. వీటి కంటే ఎక్కువగా సెలబ్రెటీల డైవర్స్ వార్తలే సంచలనంగా మారాయి.