Book launch : హైదరాబాద్ లో పుస్తక ప్రదర్శన తేదీలు ఇవే..

book launch
book launch : హైదరాబాద్ లో 37వ పుస్తక ప్రదర్శన తేదీలు ఫైనలైజ్ అయ్యాయి. డిసెంబరు 19 నుంచి 29 వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు పుస్తక ప్రదర్శన సొసైటీ వెల్లడించింది. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, పుస్తక ప్రదర్శన సలహాదారు ఆచార్య రమా మెల్కొటె, తదితర పలువురు ప్రముఖులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన లోగోని ఆవిష్కరించారు. ప్రదర్శనలో మొత్తం 300 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం త్వరలోనే లాటరీ నిర్వహించనున్నట్టు కమిటీ సభ్యులు వివరించారు.