AP BJP : ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. రఘురామకు నో టికెట్
AP BJP : బీజేపీ లోక్ సభ అభ్యర్థుల ఐదో జాబితాను నిన్న విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 111మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. ఇందులో ఏపీలో ఆరు ఎంపీ స్థానాలను కూడా ప్రకటించింది. అయితే నర్సాపురం టికెట్ ఆశించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు నిరాశ ఎదురైంది. ఆయనకు టికెట్ నిరాకరించి భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది. ఇక తెలంగాణలో ఇప్పటికే 15 మందికి సీట్లు ఖరారు చేసిన బీజేపీ తాజాగా మరో రెండు సీట్లను ప్రకటించింది. అయితే ఏపీలో తనకు పొత్తులో భాగంగా వచ్చిన 10 అసెంబ్లీ సీట్లకు నేడు అభ్యర్థులను ప్రకటించనుందని సమాచారం.
ఏపీ లోక్ సభ అభ్యర్థులు వీరే..
అరకు(ఎస్టీ) : కొత్త పల్లి గీత
అనకాపల్లి : సీఎం రమేశ్
రాజమండ్రి : పురందేశ్వరి
నర్సాపురం : భూపతిరాజు శ్రీనివాస వర్మ
తిరుపతి (ఎస్సీ) : వరప్రసాదరావు
రాజంపేట : కిరణ్ కుమార్ రెడ్డి
తెలంగాణ లోక్ సభ అభ్యర్థులు వీరే..
వరంగల్ (ఎస్సీ): ఆరూరి రమేశ్
ఖమ్మం : తాండ్ర వినోద్ రావు
కాగా, నర్సాపురం నుంచి తనకు టికెట్ ఇవ్వకపోవడంపై రఘురామకృష్ణంరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై కొందరు కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. మరి ఆయనకు ప్రస్తుతానికైతే అన్ని పార్టీల నుంచి దారులు మూసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? ఏం చేస్తారు? అనేది చూడాలి.