Election Bhojans : ఆడవారు మగవారిలో సగం అంటారు. ప్రస్తుతం అన్ని పనుల్లో ఆడవారు రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ఉంటున్నారు. దీంతో వారి మనుగడ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఆడవారిని వంటింటి కుందేలు అనేవారు. కాలక్రమంలో వారి సంపాదన మీదే చాలా మంది మగవారు బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఆడవారు ఎంతో నిష్టగా ఉంటారు. నియమ నిబంధనలు పాటిస్తూ ఉదయాన్నే స్నానం చేసి పూజలు చేసి దీపం పెట్టందే మంచినీళ్లు కూడా తాగరు. భక్తిలో వారిని మించిన వారుండరు. తులసి చెట్టుకు పూజ చేయందే వారు ఏ పని ముట్టుకోరు. అలాంటి ఆడవారు భక్తిశ్రద్ధలలో వారికి వారే పోటీ. వారికి ఎవరు సాటి అంటారు.
కానీ ఇక్కడ మాత్రం ఆడవారు మగవారిలో మందు తాగుతూ బిర్యాణీ తింటూ తూలుతున్నారు. వీరు ఆడవారేనా అనే అనుమానాలు వస్తున్నాయి. భక్తికి మారుపేరుగా నిలిచే పవిత్రకార్తీక మాసంలో ఇలా తాగుతున్నారేమిటి అనుకుంటున్నారు. ఇది ఎన్నికల సమయం కావడంతో ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన దావత్ లో వీరు ఇలా కనిపించారు. తాగుబోతులకు ఏ మాత్రం తీసిపోరు.
వీరి వాలకం చూస్తే వారి భర్తలు గుండెలు బాదుకోవడం ఖాయం. వామ్మో మేమే ఇంత యథేచ్ఛగా తాగం. అలాంటిది వీరు గుంపులుగా ఇలా తాగడమేమిటి అనుకుంటారు. నోరెళ్లబెడతారు. ఆడవాళ్లా మజాకా మగాళ్లకు ఏ మాత్రం తీసిపోరు. తాగుట్లో కూడా మేం మీతో సమానమే అని వారి భర్తలకు ఓ సవాలు విసురుతున్నట్లుగా వారి తాగుడు చూస్తే ఆశ్చర్యకరమే.
“కార్తీక మాస వన భోజనాలు” కాదు.
ఎన్నికల బోజనాలు. pic.twitter.com/bBo6lYpocS
— CHANDRA REDDY GUDIPATI…✍️✍️ (@GsrcgsrReddy) November 18, 2023