Jagan Navaratnalu : ఏపీలో ఎన్నికలకు మరో 7 రోజులే ఉన్నాయి. పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఒక్క క్షణం కూడా తీరికగా ఉండడం లేదు. రాష్ట్రంలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా జగన్ రెడ్డి సంపాదనపై ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఓ టీవీ డిబెట్ లో టీడీపీకి చెందిన కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘‘జగన్ రెడ్డి ప్రతీ సభలో తనకేమీ లేవని చెబుతుంటారు.. చాలా సార్లు ఏం చెప్పాడంటే అమరావతిలో చంద్రబాబు ఇల్లు కూడా కట్టుకోలేదని చెప్పారు. నిజమే ఆయన అమరావతిలో ఇల్లు కట్టుకోలేదు. ఎందుకంటే ఆయనకు హైదరాబాద్ లో ఇల్లు ఉంది. అంటే చంద్రబాబుకు ఒక ఇల్లు ఉంది. కానీ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న లిస్ట్ ఒక్కసారి చూద్దాం..’’ అని అన్నారు. శ్రీనివాసరావు చెప్పిన ప్రకారం జగన్ ఇండ్ల జాబితా ఇలా..
1. పులివెందుల
2. కడప
3. చెన్నై(నలభై ఏండ్ల కిందటే ఉంది)
4. హైదరాబాద్ లోటస్ పాండ్
5. తాడేపల్లి ప్యాలెస్
6. బెంగళూరు
7. ముంబై
8. కోల్ కతా
9. విశాఖ
శ్రీనివాసరావు తన మాటలను కొనసాగిస్తూ..‘‘ జగన్ రెడ్డి నవరత్నాలు అంటే ఇవే..వాస్తవానికి ముంబైలో, కోల్ కతాలో ఆయనకు ఇండ్లు ఉన్నట్టు ఎవరికీ తెలియదు. కానీ వైఎస్ చనిపోయిన 36 గంటలకు జగన్ హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు ఆయన కోలకతాలోనే ఉన్నాడు. 9 నగరాల్లో ఇండ్లు ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. జగన్ కు 9 ఇండ్లు ఉన్నాయి. చంద్రబాబుకు ఒకే ఒక ఇల్లు ఉంది. మరి వీరిద్దరిలో ఎవరు పెత్తందారుడు? ఎవరు సామాన్యుడు?’’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన జనాలకు జగన్ రెడ్డి ఇండ్ల లెక్కలు చూసి వామ్మో అంటూ ఆశ్చర్యపోతున్నారు.