Women Fire Brands-NDA Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన చేస్తున్న ఒక్కో కుట్రను తమ వాగ్దాటితో, చలోక్తులతో పక్కా వివరాలతో ఎండగట్టడంలో ఈ వీర వనితలు సక్సెస్ అయ్యారు. వీరు మాట్లాడే ప్రతి మాటకు అర్థం పరమార్థంతో పాటు వైఎస్సాఆర్ సీపీ చేస్తున్న ఆగడాలను ప్రజలకు తెలిసే విధంగా వివరించి చెబుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండవల్లి అనూష, రాయపాటి అరుణ, తేజస్వి పొడపాటి, గాయత్రి పేర్లే వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో జగన్ అరాచక పాలనను కళ్లకు కట్టినట్లు చూపించడంలో వీళ్లు సక్సెస్ అయ్యారు. ప్రజలకు అర్థమయ్యేలా జగన్ ఏం చేస్తున్నాడు. ఎలాంటి అరాచకాలు చేశాడనే వివరాలను పూస గుచ్చినట్లు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలుగా మారారు. వీరిపై వైఎస్సాఆర్ సీపీ సోషల్ మీడియా చేసే ట్రోల్స్ ను కూడా లెక్క చేయకుండా ధైర్యంగా వారి నీచ రాజకీయ విధానాలను ఎండగట్టారు.
తెలుగు ప్రొఫెషనల్స్ విభాగం అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి వైఎస్సాఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై తన దైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఐటీ ఉద్యోగులతో కలిసి హైదరాబాద్ లో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఎన్డీఏ అభ్యర్థుల కోసం మేము సైతం.. మన రాష్ట్రం కోసం అంటూ నినదిస్తూ ప్రతి సెగ్మెంట్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్న క్యాంటీన్ మూసివేతపై గళం విప్పారు.
గాయత్రి విజయవాడకు చెందిన తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై వైఎస్సాఆర్ పార్టీ చేస్తున్న ట్రోలింగ్స్ ను సమర్థంగా ఎదుర్కొని వారికి ధీటైన జవాబులు ఇస్తోంది. డిబేట్లలో పాల్గొని టీడీపీ తరఫున తమ వాదనను బలంగా చెప్పే వాగ్దాటి కలిగిన నేత. జగన్ కు రాయి తగిలిన విషయమై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. అసలు ప్రాణాలు పోయేలా కొట్టాలంటే అవినాష్ రెడ్డిని అడిగితే తెలుస్తుందని వైఎస్సాఆర్ నేతలకు కౌంటర్ ఇచ్చారు.
అనూష ఉండవల్లి కూడా సామాజిక మాధ్యమాల్లో వైఎస్సాఆర్ పార్టీని కడిగిపారేస్తుంది. అనూషపై 4 కేసులు పెట్టినా ఎక్కడా కూడా బెదరకుండా అధికార పార్టీ ఆగడాలపై ప్రశ్నిస్తూనే ఉంది. వల్లభనేని వంశీపై కూడా విరుచుకుపడింది. నారా భువనేశ్వరీని అంతా మాట అన్నారు. వడ్డీకి చక్రవడ్డీ కలిసి ఇస్తామని ప్రతిన చేశారు.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ప్రసంగాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. జగన్ ఒక్కడిపై ఎందుకు దండయాత్ర చేస్తున్నారని వైఎస్సాఆర్ అభిమాని ఒకరు అడగ్గా.. ఒక సైకో ను ఓడించాలంటే మంచి వాళ్లు చాలా మంది కలవాలని కౌంటర్ ఇచ్చారు. జనసేనపై పవన్ కల్యాణ్ గురించి ఏ మాత్రం తప్పుగా మాట్లాడిన వారిని తన మాటలతో చీల్చి చెండాడేస్తుంది. ఈ నలుగురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలుగా మారి అందరికీ దగ్గరివారయ్యారు.