Alive Food : చంపి కాదు.. ఈ జంతువులను బతికుండగానే తింటారు..!

Alive Food

Alive Food

Alive Food : మనుషులు సర్వభక్షకులు అంటే ఇటు శాఖాహారం తినడంతో పాటు మాంసాహారాన్ని కూడా భుజిస్తారు. మనిషి పరిణామ క్రమం చెందుతున్న సమయంలో ఒక్కో దశలో ఒక్కో అలవాటు చేసుకున్నాడు. అందుకే సర్వభక్షకి అయ్యాడు. అయితే ఇందులో చాలా మంది శాఖాహారులు ఉంటారు. కానీ వారు అలవాట్ల దృష్ట్యా మార్పు చెందారు కానీ, వారు మాంసాహారం కూడా తీసుకోవచ్చు. ఇక కొన్ని జంతువులు శాఖాహారం మాత్రమే తీసుకుంటాయి. మాంసాన్ని అవి ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవు. అదే మరికొన్ని జంతువులు మాంసాహారం తప్ప శాఖాహారం ముట్టుకోవు. రెండు రకాల ఆహారాన్ని మనిషితో పాటు మరికొన్ని జంతువులు తీసుకుంటాయి.

మాంసాహారం తీసుకునే మనిషి చాలా వరకు ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకుంటాడు. కానీ కొన్నింటిని మాత్రం వండకుండా, పచనం చేయకుండా లాగించేస్తాడు. అందులో సీ యానిమల్స్ ఎక్కువ, అలా కొన్ని సార్లు సంప్రదాయం ప్రకారం తింటే.. మరికొన్ని సార్లు రుచికోసం తింటారు. బతికుండగానే తినే జంతువుల గురించి తెలుసుకుందాం.

కప్పలు
భారత్ లో పెద్దగా కప్పలను తినరు కానీ.. జపాన్, చైనా లాంటి దేశాల్లో ఇష్టంగా తింటారు. చిన్న చిన్న కప్పలను బతికి ఉండగానే నమిలేస్తుంటారు. చైనాలో ‘సాన్ జీ ఎర్’, జపాన్ లో ‘లైవ్ ఫ్రాగ్ సాషిమి’ అనే వంటకాల్లో బతికున్న కప్పలను వేసుకొని తింటారు. ఇది శరీరానికి ఎక్కువ పోషకాలను ఇస్తుందని వారు చెబుతుంటారు.

ఆక్టోపస్
కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండే సముద్రం జీవుల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాల్లో చిన్న చిన్న ఆక్టోపస్ లను బతికి ఉండగానే తినేస్తారు.

కోతి మెదడు
ఆసియాలోని కొన్ని ప్రాంతాల ఆటవికులు కోతులను ఆహారంగా తింటారు. మరి కొన్ని ప్రాంతాల్లో కోతి మెదడును ఇష్టంగా తింటారు. అరుదైన సందర్భాల్లో కోతి బతికి ఉండగానే తల పగలగొట్టి మెదడు బయటికి తీసి అలాగే తింటారు. కొన్ని ఆటవిక జాతులు ఇప్పటికీ ఇదే ఆహారాన్ని తింటున్నారు.

చేపలు
జపాన్ లో ‘ఇకి జుకురి’ అనే వంటకంలో చేపలు బతికుండగానే సర్వ్ చేస్తారు. సజీవంగా ఉన్నప్పుడే వేసుకొని తింటారు. ఆ చేపలను రకరకాలుగా మెలి తిప్పి లొట్టలు వేసుకుని తింటారు.

స్క్వీడ్
సముద్రం జాతికి చెందిన ఈ జీవిని కొరియన్లు బతికి ఉండగానే ఇష్టంగా తింటారు. కొరియాలోని దీన్ని ‘సన్నక్జి’ అని పిలుస్తారు. దీన్ని లైవ్ గా తినడం వల్ల పోషకాలు ఎక్కువగా లభిస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

రొయ్యలు
రొయ్యల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో సముద్ర ప్రాంతాల్లో దొరికే పప్పు రొయ్యలను సజీవంగానే తింటారు. కొన్ని వంటకాల్లో వీటిని సజీవంగా వేసుకొని తింటారు. సముద్ర తీర ప్రాంతాల్లోని కొన్ని రకాల జాతులు బతికి ఉన్న రొయ్యలు తినడం తమ సంప్రదాయంగా భావిస్తారు.

కీటకాలు
చీమలు, తేనె టీగలు, ఉసిళ్లు వంటి చిన్న చిన్న జీవులను వేయించుకొని తినడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. దట్టమైన అటవీ ప్రాంతాల్లో గిరిజనులు ఒక రకమైన చీమలతో వంటకాలు వండుకొని ఇష్టంగా ఆరగిస్తారు.

TAGS