Narendra Modi : దేశం ఎదుర్కొంటున్న 5 సమస్యలకు ఒకటే పరిష్కారం..అదే మోదీ!
Narendra Modi : దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు విడతలు పూర్తికాగా, చివరి విడత జూన్ 1న జరుగబోతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మూడో సారి మోదీ అనే నినాదమే దేశమంతా మార్మోగుతుందనే విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని మోదీ సహ బీజేపీ నేతలంతా ధీమాగా చెబుతున్నారు. దేశ ప్రజలు కూడా అందుకు రెడీగా ఉండడమే మనం చూస్తేనే ఉన్నాం. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా మోదీ హవా నడుస్తోందని వేరే చెప్పక్కర్లేదు.
దేశ ప్రజలు మూడోసారి మోదీనే పీఎంగా చేయాలని భావిస్తున్నారో మనకు తెలిసిందే. దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించే ఏకైక మొనగాడు మోదీ అని ప్రజలు నమ్ముతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తీవ్రంగా వైరల్ అవుతోంది. దీనిని బీజేపీ సంబంధించిన వారు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. దాని ప్రకారం..
దేశం ఎదుర్కొటున్న 5 ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి వరుసగా 1. కాంగ్రెస్ 2. చైనా 3. పాకిస్తాన్ 4. అవినీతి 5. జాతివ్యతిరేకత వర్గం. అయితే ఈ 5 సమస్యలకు ఏకైక పరిష్కారం మోదీ మాత్రమే. ఆయన మూడోసారి ప్రధాని ఎన్నికైతే అలవోకగా ఈ ఐదు సమస్యలను అధిగమించొచ్చు అనే అర్థంలో ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 ఏండ్లు అధికారంలో ఉంది. అయినా కూడా దేశ పురోగతి ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉంది. కాంగ్రెస్ చివరగా పాలించిన టర్మ్ వరకు దేశంలో రోడ్లు లేవు, వేలాది గ్రామాలకు కరెంట్ లేదు. అక్షరాస్యత, వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే. ఆ తర్వాత మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే మౌలిక సదుపాయాలు, విద్య , వైద్య సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడం ద్వారా మొదటి సమస్యను పరిష్కరించవచ్చు.
ఇక రెండు, మూడు సమస్యలు చైనా, పాకిస్తాన్. పక్కలో బల్లెంలా మారిన ఈ రెండు దేశాలను మోదీని మరోసారి ప్రధానిగా చేస్తేనే భారత్ అంటే వణికిపోతాయి. లేదంటే మరల బాంబు దాడులు, ఆక్రమణలు సహజమైపోతాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాము ఆడిందే ఆటగా చేసుకోవచ్చని ఈ రెండు దేశాలు భావిస్తుంటాయి. అదే మోదీ వస్తే తాము తోకముడుచుకోవడం తప్ప చేసేదేమి ఉండదని ఆ దేశాలకు బాగా తెలుసు. అలాగే నాలుగో సమస్య అయిన అవినీతి. దేశంలో మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చిన్న అవినీతి జరుగలేదు. ఇప్పటివరకూ ప్రతిపక్షాలు సైతం ఒక్క అవినీతి ఘటనను వెలికితీయలేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే మోదీ ప్రభుత్వం ఉంటే అవినీతి అనే రక్కసి ఆమడదూరంలో ఉంటుందనే చెప్పవచ్చు. ఇక చివరి సమస్య యాంటీ నేషనల్స్ అనగా జాతిద్రోహులు లేదా జాతివ్యతిరేకులు. వీరు భారత్ లో ఉంటూ పుట్టిన నేలకే ద్రోహం చేసే రకం. మన మధ్యనే ఉంటూ శత్రుదేశాలకు సాయం చేసే ఈ ద్రోహుల పని పట్టాలంటే మోదీ వల్లే సాధ్యం. మోదీ ఉన్నంత కాలం వీళ్ల ఆటలు సాగవు. అందుకే మోదీ ఓడిపోవాలని కోరుకుంటుంటారు. అయితే ప్రజలు వీరిని పెద్దగా పట్టించుకోరు. వారికి తెలుసు ఎవరు గెలిస్తే తమ భవిష్యత్ భద్రంగా ఉంటుందోనని. అందుకే వారి ఏకైక చాయిస్ మోదీ మాత్రమే.