JAISW News Telugu

Brahmarakshasa : ఆ వార్తల్లో నిజం లేదు.. బ్రహ్మ రాక్షస కొనసాగుతుంది..

Brahmarakshasa

Brahmarakshasa

Brahmarakshasa : ‘హను-మాన్’ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వరకు బాగా క్రేజ్ వచ్చింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ సమయంలో సినిమా రిలీజ్ కావడంతో మరింత భక్తి పెరిగి బాక్సాఫీస్ లో వసూళ్ల వర్షం కురిసింది. పైగా కథ, కథనం, స్క్రీన్ ప్లే కూడా బాగుండడంతో ప్రశాంత్ వర్మతో పాటు తేజ సజ్జకు కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా కమిట్ అయ్యారు. స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై వివాదాలు కమ్ముకున్నాయి. ఆదిలోనే హంసపాదు ఎదురైందని మీడియా కథనాలు వెలువడ్డాయి.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిహాసల్ షూట్ చేశారు. ఇందులో ప్రశాంత్ వర్మ, రణ్ బీర్ సింగ్ మధ్య చిన్నపాటి వివాదం తలెత్తిందని, అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి రణ్ వీర్ సింగ్ తప్పుకున్నాడని, మరో స్టార్ హీరో కోసం ప్రశాంత్ వెతుకుతున్నాడన్న కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై పూర్తి వివరణ ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని మాత్రం ‘మైత్రీ’ స్పష్టం చేసింది. అయితే వీటిపై ఇటీవల ప్రశాంత్ వర్మ స్పందించారు.

రణ్ వీర్ సింగ్‌తో తన మూవీ పక్కాగా ఉంటుందని చెప్పాడు. ఈ ప్రాజెక్టు గురించి వస్తున్నవన్నీ కేవలం రూమర్లే అంటూ కొట్టి పారేశాడు. ఈ గాసిప్స్ ను ఎవరు పట్టించుకోవద్దని అసలు ఇందులో ఎలాంటి అర్థం లేదని, అయినా ఇలాంటి వాటిని పట్టించుకోనని ప్రశాంత్ తెలిపాడు.

రణ్ వీర్ సింగ్ తాము చేసింది జస్ట్ లుక్ టెస్ట్ మాత్రమే అని.. అది కూడా సంతృప్తికరంగానే ఉందని, నూటికి నూరు శాతం ఈ సినిమా ముందుకు సాగుతుందని ప్రశాంత్ స్పష్టం చేశాడు. ‘హను-మాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను వచ్చే ఏడాదే రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో సమానంగానే రణ్ వీర్ సింగ్ మేయిన్ రోల్ పోషిస్తున్న ‘బ్రహ్మ రాక్షస’ను తీస్తున్నామని చెప్పారు. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Exit mobile version