Rajya Sabha Elections : కామన్ గా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఎంతో హడావిడి ఉంటుంది. గ్రామస్థాయి ఎన్నికలకే ఓ రేంజ్ లో సందడి ఉంటుంది. పార్టీలు, ఇటు జనాలు బిజీబిజీగా మారిపోతారు. కానీ తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల విషయంలో మాత్రం పార్టీలు సైలెంట్ అయిపోయాయి. మూడు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ కూడా తమ అభ్యర్థులపై కనీసం లీకులు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక్క సీటు లభిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీటు అంటే ఇప్పుడు హాట్ కేకే. అయితే ఎవరి పేర్లు వినిపించడం లేదు. మరో మూడు రోజుల్లో గడువు ముగియనున్నా ఇంకా పేర్లపై ఎలాంటి స్పష్టత రాలేదు.
ఇటీవల ప్రధాని మోదీ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. రాహుల్ యూపీ నుంచి పారిపోయారని.. సోనియా రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారని పరోక్షంగా సెటైర్స్ వేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు కానీ సోనియా గాంధీ తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. నిజానికి ఖమ్మం నుంచి పోటీ చేయాలని సోనియాను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అక్కడ్నుంచి పోటీ చేయదల్చుకుంటే.. రాజ్యసభకు వెళ్లరు. లేకపోతే ఆమెను ఓ స్థానం నుంచి అభ్యర్థిగా ఖరారు చేస్తారు. రెండో సీటు తెలంగాణ వారికే లభిస్తుంది కానీ వారు ఎవరన్న అంశం రేవంత్ రెడ్డి చాయిస్ లో ఉంటుందని చెబుతున్నారు.
ఇటు బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థి విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు చెప్పినట్టుగా వినే పరిస్థితి లేదు. బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉంటే మూడో స్థానం కూడా కాంగ్రెస్ గెలుచుకునే చాన్స్ ఉంది. మర్యాదపూర్వక భేటీలు అయిన ఎమ్మెల్యేలు. .కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ పరువు పోతుంది. కచ్చితంగా పోటీ ఉంటుందని ఎవర్ని నిలబెడతామన్నది మాత్రం సస్పెన్స్ అని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.