Lavanya Tripathi : వరుణ్ చెప్పినట్టు నేను వినాలి అని రూల్ ఏమిలేదు – లావణ్య త్రిపాటి!
Lavanya Tripathi : అందం తో పాటుగా అద్భుతమైన అభినయం , నటన కలిగిన నేటి తరం హీరోయిన్స్ లో ఒకరు లావణ్య త్రిపాఠి. మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ నుండి తన చివరి చిత్రం వరకు ఆమె నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ వచ్చింది. అందాల అరోబోత ఒలకబోసేంత అందం ఆమెలో ఉన్నప్పటికీ కూడా స్కిన్ షో చెయ్యడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపించలేదు.
తనకంటూ ఒక హద్దుల్లో ఉంటూ గీత గీసుకుంది కాబట్టే ఆమె నెంబర్ గేమ్ లో లేదు. కానీ ఆమెకంటూ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకుంది. టాలీవుడ్ లో సమంత తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈమె మరో చిరునామా లాగ మారిపోయింది. రీసెంట్ గా ఈమె టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్ళ నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ లో ఈ క్యూట్ జంట, గత ఏడాది మూడు ముళ్ల బంధం తో ఏకం అయ్యింది.
ఈ ఇద్దరికీ సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే రీసెంట్ గానే లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్ పర్ఫెక్ట్ ‘ అనే వెబ్ సిరీస్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నది లావణ్య. ఈ సిరీస్ ఫిబ్రవరి 2 వ తేదీ నుండి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన లాంచ్ ఈవెంట్ లో మీడియా తో లావణ్య త్రిపాఠి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఒక రిపోర్టర్ లావణ్య ని అడుగుతూ ‘పెళ్లి తర్వాత సినిమాలు చేస్తాను అంటే కొంతమంది ఒప్ప్పుకోరు కదా, మరి మీ విషయం లో మీ అత్తారింట్లో ఒప్పుకున్నారా?, పెళ్లి తర్వాత మీ జీవితం లో ఏమైనా మార్పులు ఉన్నాయా’ అని అడగగా, దానికి లావణ్య త్రిపాఠి సమాధానం చెప్తూ ‘ పెళ్లికి ముందు నేను ఎలా ఉన్నానో, పెళ్లి తర్వాత కూడా నేను అలాగే ఉన్నాను. నన్ను ఇది మార్చుకో, అది మార్చుకో, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని ఇంట్లో ఎవ్వరూ కండిషన్స్ పెట్టలేదు. అలా కండిషన్స్ పెడితే ఒప్పుకునే టైపు కూడా కాదు నేను. ఇది మా అత్తారింట్లో ఆరేళ్లుగా తెలుసు, అంతా అర్థం చేసుకున్నారు కాబట్టే మేము ఒక్కటి అయ్యాం’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.