
Union Minister Kishan Reddy
Union Minister Kishan Reddy : సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదని తెలిపారు. దేశంలో ఏ బొగ్గు గనిని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన లేదని వివరించారు.
సింగరేణిని ప్రైవేటుపరం చేయాలంటే 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే ప్రధానమని స్పష్టం చేశారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ పొరుగు రాష్ట్రం ఒడిశాతో చర్చించి సింగరేణికి ఒక బొగ్గు గనిని కేటాయించామని తెలిపారు.