Koratala Shiva : టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకడైన కొరటాల శివ మెడ చుట్టూ సమస్యలే అలుముకున్నాయి. ఆయన గత చిత్రం ఆచార్య సినిమాలోని బిజినెస్ కూడా వేలు పెట్టి ఘోరమైన నష్టాలను చవిచూసి, ఎంతో కాలం బయ్యర్ల నిరసనల మధ్య తిరుగుతూ ఉండేవాడు. మొత్తానికి ఆ సమస్య నుండి బయటపడి జూనియర్ ఎన్టీఆర్ తో దేవర చిత్రం మొదలు పెట్టాడు. ఈ సినిమాని మొదలు పెట్టి దాదాపుగా ఏడాది పూర్తి అయ్యింది. రీసెంట్ గానే గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యగా, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక కొరటాల ట్రాక్ లోకి వచ్చేశాడులే అని అనుకునేలోపే మళ్ళీ ఆయన సమస్యల్లో చిక్కుకున్నాడు. గతం లో కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాకి దర్శకత్వం వహించి భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రోజుల్లో ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
అయితే అప్పట్లో ఈ సినిమా కథ నాది అంటూ శరత్ చంద్ర అప్పట్లో నాంపల్లి హై కోర్టు లో కేసు వేసాడు. శరత్ చంద్ర ఫిర్యాది ని పరిశీలించిన కోర్టు, అతన్ని సమర్థిస్తూ కొరటాల శివ పై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు ని సవాలు చేస్తూ కొరటాల శివ సుప్రీమ్ కోర్టు పిటీషన్ ని దాఖా చేసాడు. రీసెంట్ గా విచారణ జరిపిన సుప్రీమ్ కోర్టు కొరటాల శివ పిటీషన్ ని కొట్టేసినట్టు , ఆయనపై యాక్షన్ తీసుకోవాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ఒక రేంజ్ లో ప్రచారం అయ్యింది.
అయితే దీనిపై కొరటాల శివ తన మూవీ టీం ద్వారా స్పందించాడు ‘ గత కొంత కాలం గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు మొత్తం రూమర్స్. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది, విచారణ జరుగలేదు. అలాగే మేము ఎవరి కథని కాపీ కొట్టి ఈ సినిమాని తియ్యలేదు. ఇది మా సొంత క్రియేటివిటీ తో తీసిన సినిమా. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాము కానీ, ఈ కథ మాది కాదు అని ఒప్పుకునే సమస్యే లేదు’ అని చెప్పుకొచ్చారు.