Wolves Hunting : ‘తోడేలు’ ఈ జంతువు పేరు ఠక్కున స్పురణకు వచ్చేది వేగం, బలం, వేటాడడంలో విలక్షణం. పులి, సింహం లాంటి పెద్ద జంతువుల కంటే కూడా వేగంగా, బలంగా ఆహారాన్ని సంపాదించుకోగలదు. వేగం, వేట, బలం, ఆలోచనలో అడవిలో అన్ని జంతువుల కంటే ఇవి ఒక అడుగు ముందే ఉంటాయి. తోడేలు అన్ని విషయాల్లో ముందుంటూనే వలస వెళ్లడంలో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. తోడేళ్లు వలస వెళ్లాలంటే ఒక వ్యూహాన్ని అవలంభిస్తాయి. దీనిని పరిశీలించిన జంతు పరిశోధకులు కొన్ని విషయాలను కనుక్కున్నారు.
తోడేలు ఎక్కడికైనా వలసగా వెళ్లాలంటే ఐదు విభాగాలుగా విడిపోతుంది. సాధారణంగా మొదటి వరుసలో నాయకుడు ఉంటాడు. కోతులు, ఇంకా సింహాలు, అంతెందుకు మనుషులు కూడా ముందు వరుసలో నాయకుడు ఉంటే వెనుక అందరూ ఫాలో అవుతుంటారు. కానీ తోడేళ్లో ఇది కొంచెం డిఫరెంట్
మొదటి వరుసలో వృద్ధాప్యం పొందిన తేడేళ్లు ఉంటాయి. వారి అనుభవం ఉపయోగించి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ముందుగా గ్రహిస్తాయి. ఒక వేళ అనుకోని విధంగా ప్రమాదం ఎదురైతే ముందుగా అవే ప్రాణాలు కోల్పోతాయి.
ఇక తర్వాతి వరసలో దృఢంగా, వేగంగా స్పందించే తోడేళ్లు ఉంటాయి. ఇవి ముందు నుంచి ఏదైనా ప్రమాదం సంభవిస్తే వేగంగా స్పందిస్తాయి. వృద్ధాప్యంలో ఉన్న తోడేళ్ల సూచనలను ఇవి పాటిస్తాయి. వీటి చూపు, వేట, ఎదురుదాడి తీవ్రంగా ఉంటుంది.
ఇక మూడో వరుసలో ఎక్కువ తోడేళ్లు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఆడ తోడేళ్లు, తోడేలు కూనలు ఉంటాయి. అంటే యంగ్ జనరేషన్, ప్రొడ్యూస్ కు సంబంధించినవి ఇందులో ఉంటాయి. వీటిని ముందు, వెనుక నుంచి ఉన్న వరుసలు కాపాడుకుంటుంటాయి.
ఇక నాలుగో వరుసలో కూడా రెండో వరుసలో లాగా వేగంగా స్పందించే తోడేళ్లు ఉంటాయి. ఇవి ముందు నుంచి ఏదైనా ప్రమాదం సంభవిస్తే వేగంగా స్పందిస్తాయి. వృద్ధాప్యంలో ఉన్న తోడేళ్ల సూచనలను ఇవి పాటిస్తాయి. వీటి చూపు, వేట, ఎదురుదాడి తీవ్రంగా ఉంటుంది.
ఇక చివరి ఐదో వరుసలో ఆ గ్రూప్ లీడర్ తోడేలు ఉంటుంది. అన్నింట్లో ముందు వరుసలో ఉంటే తోడేళ్లో వెనుక వరుసలో ఉంటుంది. మొత్తం గ్రూప్ ఎలా ప్రయాణం చేస్తుంది. డిస్టెన్స్ ఎంత మేరకు ప్రయాణం చేయాలో ఇది పర్యవేక్షిస్తుంది. దీంతో పాటు లైన్ నుంచి ఏ తోడేలు బయటకు వెళ్లినా వార్నింగ్ ఇస్తుంది. వెనుక లీడర్ ఉండడంతో ముందున్న సేన క్రమశిక్షణతో ఉంటుంది. ఇది తోడేలు ప్లాన్.