AP News : ఏపీ మొత్తం ప్రస్తుతం అట్టుడుకుతున్న పరిస్థితి నెలకొంది. గత ఐదేళ్లుగా జగన్ బ్యాచ్ చేతిలో అధికారాన్ని పెట్టుకుని సృష్టించిన విధ్వంసకాండ గురించి అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ ను పిచ్చోడిగా ముద్రవేసి నడిరోడ్డుపై కూర్చోబెట్టిన చరిత్రను సొంతం చేసుకుంది వైసీపీ సర్కార్.. తాజాగా పోలింగ్ రోజు అల్లర్లు సృష్టించి పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. ఇప్పటి వరకు జరిగిన విధ్వంసంలో ఎంతో మంది నష్టపోయారు. ఇది ఇంతటితో ఆగిపోతుందా అంటే అనుమానమే. ఫలితాల తర్వాత కూడా ఏపీలో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని ఇంటలిజెన్స్ సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అదనపు బలగాలను సమస్యాత్మక ప్రాంతాలలో మోహరించిన విషయం తెలిసిందే. పచ్చదనానికి, వెటకారానికి కేరాఫ్ అయిన ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఇందుకు వేదిక కావడం ఒకింత ఆందోళన కలిగించే విషయం.
గత నాలుగైదు రోజులుగా విడుదలవుతున్న ‘వైసీపీ అండ్ కో – విధ్వంసకాండ’ వీడియోలతో ప్రజల్లో కూడా స్పష్టత వచ్చేసింది. వీటన్నింటికి తోడు కేంద్ర హోంశాఖ తాజాగా ఏపీ డీజీపీకి పంపిన లేఖతో, సామాన్య ప్రజలకే కాదు, ప్రధాని పర్యటిస్తున్న టైంలో కూడా భద్రత కరువైందని స్పష్టమయింది. మే 8న ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో పర్యటించిన సంగతి తెలిసిందే. భారీగా ప్రజలు పాల్గొన్న ఈ రోడ్ షోలో మోడీ, చంద్రబాబు, పవన్ ఒకేవేదికపై కనిపించారు. అయితే ఈ రోడ్ షోలో భద్రత లోపించిందని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాని పర్యటిస్తున్న ప్రాంతం ‘నో ఫ్లైయింగ్ జోన్’గా డిక్లేర్ కాగా, నాడు రోడ్ షో ప్రారంభానికి ముందు, ముగింపు సమయంలో కూడా విజయవాడ, బందర్ రోడ్డులో డ్రోన్లు ఎగరడం భద్రతా లోపాలను వేలెత్తి చూపింయాయి. ఒక డ్రోన్ ను ఎస్పీజీ సిబ్బంది నిర్వీర్యం చేయడం ప్రధానంగా చర్చనీయాంశం అయింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర హోం శాఖ తాజాగా ఏపీ డీజీపీకి నోటీసులు కూడా జారీ చేసింది. ఏకంగా ప్రధాని పర్యటన చేస్తున్న సమయంలో కూడా భద్రతను ఏర్పాటు చేయడంలో ఏపీ పోలీసులు విఫలం కావడం అంటే, అసలు ఏపీలో సామాన్యులకు భద్రత ఉందా? అన్న ప్రశ్న తలెత్తకమానదు. జూన్ 4పైనే ప్రస్తుతం రాష్ట్ర ప్రజల అందరి చూపు. ఈ అరాచక ప్రభుత్వం పోవాలని అంతా కోరుకుంటున్నారు.