AP Election Results : మరో అయిదు రోజుల్లో సాధారణ ఎలక్షన్ల రిజల్ట్ రాబోతుంది. జూన్ 1న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చెప్పేందుకు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే ఏపీలో అధికారం ఎవరి వైపు ఉందో ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ఈజీగా గెలుస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు జగన్ దే గెలుపు అని జోస్యం చెబుతున్నారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ కూటమి, వైసీపీ మధ్య ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. పోలింగ్ సరళి పైన రెండు పార్టీలు పూర్తి స్థాయిలో సమీక్షించుకున్నారు. ఆయా పార్టీల అభ్యర్దులు గెలుపు, ఓటముల పైన ఒక అంచనాకు ఇప్పటికే వచ్చేశారని తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన రోజే తమకు సంబంధించిన సర్వే సంస్థల నుంచి వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. దీంతో ఓటింగ్ సరళిపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు నివేదికలు పరిశీలించి కూటమి అభ్యర్థులు, వైసీపీ నాయకులు ఒక స్పష్టతకు వచ్చారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సర్వే సంస్థలు ఆయా పార్టీలకు ఇప్పటికే సర్వేల ప్రకారం… వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగిన వెంటనే ఐఫ్యాక్ మీడియా సంస్థ వద్దకు వెళ్లి 175 కు 175 గెలవబోతున్నామని ఉద్యోగస్తుల్లో ధైర్యం నింపారు. ఈ సారి పలు సర్వే సంస్థలకు చాలా టఫ్. సర్వే సంస్థలు ఓటరు నాడీని పట్టుకుని సరైన విశ్లేషణ చేసి ఆయా పార్టీలకు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. మహిళ ఓటర్లు పెరగడం, గ్రామీణ స్థాయిలో రెండు శాతం ఓటింగ్ ఎక్కవగా నమోదు కావడం, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లు ఓటింగ్ ఎలా జరిగిందనే వివరాలను ఆయా పార్టీల నాయకులకు వెల్లడించారు. దీంతో కూటమి, వైసీపీ నాయకులు ఒక అంచనాకు వచ్చారు. భారీ విజయం మాదంటే మాదని విర్రవీగుతున్నారు. జూన్ 4న ఏపీలో ఫలితాలు ఎవరినీ అందలం ఎక్కిస్తాయో.. ఎవరినీ కిందకు పడేస్తాయో చూడాలి.