Bujji and Bhairava : అక్కడ బుజ్జి అండ్ భైరవదే హవా
Bujji and Bhairava : రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను దాటేసింది. నాగ్ అశ్విన్ ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. సినిమా విడుదల ముందు వరకు పెద్దగా ప్రమోషన్స్ చేయని టీమ్ రిలీజ్ దగ్గర పడే సరికి ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. నాగ్ డైరెక్టర్ గానే కాకుండా మూవీ ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేశారు. రోజుకో క్రేజీ అప్ డేట్ ఇస్తూ మూవీపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు.
సినిమా విడుదలకు ముందు నాగ్ అశ్విన్ జర్నీ ఆఫ్ కల్కి పేరుతో మాట్లాడిన ప్రమోషన్ వీడియోలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ముందుగానే కల్కి ప్రపంచాన్ని మరింత అర్థమయ్యేందుకు బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ యానిమేటెడ్ సిరీస్ సూపర్ హిట్ అయింది.
ఇప్పుడా ఆ యానిమేటెడ్ సిరీస్ కూడా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 2024 ప్రథమార్థంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాలు/ సిరీస్ ల జాబితాలో టాప్ లో ఉంది. 4.9 మిలియన్ల వ్యూస్ తో అగ్రస్థానం దక్కించుకుంది. ఓర్మాక్స్ సంస్థ దీనికి సంబంధించి జాబితాను విడుదల చేసింది. బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఈటీవీ విన్ లోని 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ రెండో స్థానంలో ఉండగా, మిస్ పర్ఫెక్ట్ (డిస్నీ+ హాట్స్టార్) 3.1 మిలియన్ల వీక్షణలతో మూడో స్థానంలో ఉంది. సిట్ (SIT) మూవీ (జీ5) 2.8 మిలియన్ల వ్యూస్ తో తరువాతి స్థానంలో స్థానంలో ఉంది. ఇక భామాకలాపం-2 (ఆహా) 2.7 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.. ఇంటర్నేషనల్ షోస్ కేటగిరీలో ది బాయ్స్ సీజన్-4 (అమెజాన్ ప్రైమ్ వీడియో) 10.5 మిలియన్ వ్యూస్ తో తొలి స్థానంలో నిలిచింది.
జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్-2 8.2 మిలియన్ వ్యూస్ తో తరువాతి స్థానంలో ఉంది. ఫాల్ అవుట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) 8.0 మిలియన్ వ్యూస్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది. బాడీ ప్లాబ్రమ్ (నెట్ ఫ్లిక్స్) – 6.9 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానాన్ని దక్కంచుకంది. బ్రిడ్జర్టన్ సీజన్ 3 (నెట్ ఫ్లిక్స్) – 6.0 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.