CM Jagan Road Show : జగన్ రోడ్ షోలకు జనమే లేరు

Jagan Road Show
CM Jagan Road Show : పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ సీఎం జగన్ కు చుక్కలు కనపడుతున్నాయి. జనాలు జగన్ ను దూరం కొడుతున్నారు. అసలు ఆయన రోడ్ షోలకు జనం స్పందనే కరువైంది. తాజాగా సీఎం జగన్ రాయలసీమలో పర్యటించారు. అక్కడ జగన్ ను పట్టించుకున్న వారే లేకుండా పోయారు.
నిజానికి రాయలసీమలో జగన్ కు బలం ఎక్కువ. వైసీపీ గత ఎన్నికల్లో మొత్తం 52 సీట్లకు 50 వరకూ గెలుచుకుంది. అంతటి బలమైన సీమలో జగన్ టూర్ చేస్తే పట్టుమని 10 మంది కూడా లేని పరిస్థితి దాపురించింది.
తాజాగా అనంతపురం జిల్లా పర్యటనలో జగన్ బస్సు యాత్ర సాగుతుండగా ఒక్క పురుగు లేదు. కేవలం పోలీసులు మాత్రమే రక్షణగా తాళ్లు పట్టుకొని వెళుతున్న దుస్థితి కనిపించింది.