TDP-YCP : అప్పట్లో టీడీపీ..ఇప్పుడు వైసీపీ.. సీన్ రిపీట్ కాబోతుందా?
TDP-YCP : 2019 ఎన్నికల్లో సర్వేలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. వైసీపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అప్పుడు వాటిని పెయిడ్ సర్వేలని టీడీపీ కొట్టిపారేసింది. తామే విజయం సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేసింది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత తమదే అని చెప్పుకుంది. రాజధాని, పోలవరం, కరెంటు లాంటి విషయాల్లో ప్రజలను మెప్పించింది తామేనని భావించింది.
ఓటమిపై టీడీపీకి ముందే క్లారిటీ ఉన్నా తాము చేసిన పనులే తమకు రక్షణగా నిలుస్తాయని అనుకున్నారు. వైసీపీ కులం దారిలో ఓట్లు అడుగుతుందని గుర్తించింది. కానీ టీడీపీ ఆ దిశగా అడుగులు వేయలేదు. కుల భావం రెచ్చగొట్టి వైసీపీ లాభపడింది. అనూహ్యమైన ఫలితాలతో అధికారం చేజిక్కించుకుంది. టీడీపీ భంగపాటు కలిగింది.
ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ ఎదుర్కొంటోంది. తాము అందరి ఖాతాల్లో డబ్బులు వేశామని వారే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ అదంతా సులభం కాదని తెలుస్తోంది. సర్వేలన్ని టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. ఇండియా టుడే సర్వేలో టీడీపీ కూటమి విజయం తథ్యమని చెప్పింది. జాతీయ స్థాయిలో సర్వేలు కూడా టీడీపీ కూటమిదే విజయం అంటున్నాయి.
వైసీపీ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తామే విజయం సాధిస్తామని చెప్పుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ కూటమి విజయం ఖాయమని అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈనేపథ్యంలో వైసీపీ ఓటమి జరిగిపోయిందంటున్నారు. దీంతో చాలా మంది వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమిలో చేరుతున్నారు. తమ భవిష్యత్ కోసం పార్టీ మారుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ మార్పులు అనివార్యం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకే వైసీపీని ఇంటికి సాగనంపి టీడీపీ కూటమిని అధికారానికి ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. దీని వల్ల పరిపాలనలో మంచి మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.