JAISW News Telugu

From Steve Jobs to Altman : సొంత సంస్థనే వారిని గెంటేసింది.. స్టీవ్ జాబ్స్ నుంచి.. ఆల్ట్‌మన్ వరకు.. ఎవరెవరంటే?

Steve Jobs to Altman

Steve Jobs to Altman

From Steve Jobs to Altman : ఓపెన్ ఏఐ (Open AI) అనే సంస్థ బోర్డు సభ్యుల విశ్వాసం కోల్పోవడంతో ఆ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ ను సీఈఓ విధుల నుంచి కంపెనీ తొలగించింది. ఆయన స్థాపించిన కంపెనీలోనే ఆయన ఉద్యోగం కోల్పోవడం టెక్‌ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇది సీఈఓ పోస్ట్ ఎప్పటికీ ఉండిపోయేది కానది కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అందులో సీఈఓగా చేసిన ప్రముఖులు తమ పదవికి రాజీనామా చేశారు. అందులో గ్రేట్ యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ కూడా ఉన్నారు.

గతేడాదితో పోలిస్తే రాజీనామా చేసిన సీఈఓల సంఖ్య 49 శాతం పెరిగిందని ‘గ్రే అండ్ క్రిస్మస్‌‘ నివేదిక చెప్తోంది. గతే డాది (2022) 969 మంది సీఈఓలు తమ పోస్టుకు రాజీనామా చేస్తే ఈ ఏడాది (2023) 1,425 మంది రాజీనామా చేశారు. కారణం ఏదైనా ఆయా సంస్థల్లో కీలక పోస్ట్ లో ఉన్నవారు రాజీనామా చేస్తుండడం కొంత ఆందోళన కలిగించే విషయమే. ఫౌండర్లనే గెంటేసిన జాబితాను ‘వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌’ ట్వీట్ ద్వారా పేర్కొంది. ఇక ఏఏ కంపెనీ ఫౌండర్లను తొలగించిందో చూద్దాం.

స్టీవ్‌ జాబ్స్‌..
‘యాపిల్’కు ప్రాణం పోసింది స్టీవ్ జాబ్స్ అని మనందరికీ తెలిసిందే. కంపెనీ పెట్టిన తొమ్మిదేళ్లకు కంపెనీ బోర్డు సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో జాన్‌ స్కుల్లేకు బాధ్యతలు అప్పగించింది. ప్రఖ్యాత డ్రింగ్ కంపెనీ పెప్సీలో పని చేసిన జాన్‌ను స్టీవ్‌ జాబ్స్‌ ఇంటర్వ్యూ చేసి కంపెనీలోకి తీసుకున్నాడు. 1997లో స్టీవ్‌ రెండో సారి సీఈఓగా ఎన్నికై, తన ఉత్పత్తులతో కంపెనీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లారు. 2011లో అనారోగ్యంతో సీఈఓగా వైదొలిగి, టిమ్ కుక్‌కు బాధ్యతలు అప్పగించారు.

జాక్‌ డోర్సే..
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫాం ట్విటర్ (ఎక్స్) ను జాక్ డోర్సే 2006లో స్థాపించాడు. అయితే తన పనితీరు సరిగా లేదని కారణంతో 2008లో సీఈఓ బాధ్యతల నుంచి కంపెనీ తొలగించింది. మళ్లీ 2011లో అదే పోస్ట్ లో బాధ్యతలు చేపట్టారు. 2021లో ఆయన స్థానంలో పరాగ్ అగర్వాల్‌ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కూడా సీఈవో స్థానం నుంచి రిజైన్ చేసి వెళ్లిపోయారు.

శామ్‌ ఆల్ట్‌మన్‌
ఓపెన్ ఏఐ (Open AI) కంపెనీకి సంబందించి బోర్డుతో నిజాయితీగా ఉండడం లేదని, సరైన సమాచరం ఇవ్వడం లేదని, నిర్ణయాలను కూడా అడ్డుకుంటున్నాడన్న ఆరోపణలతో సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ను ఆ బాధ్యతల నుంచి కంపెనీ బోర్డు తొలగించింది. అయితే ఆయననే మళ్లీ సీఈఓను చేయాలని కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీలో అతిపెద్ద వాటాదారు మైక్రోసాఫ్ట్ తో కొంత మంది చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వీరే కాకుండా ట్రావిస్‌ కలానిక్‌ (ఉబెర్‌), జెర్రీ యాంగ్ (యాహూ), ఆండ్రూ మాసన్‌ (గ్రూపాన్‌), డేవిడ్‌ నీలేమన్‌ (జెట్‌బ్లూ), డోవ్‌ చార్నే (అమెరికన్‌ అప్పరల్‌), రాబ్‌ కాలిన్‌ (ఎట్సీ), జార్జ్ జిమ్మర్‌ (మెన్స్‌ వేర్‌హౌస్‌), మైక్‌ లాజార్డిస్‌, జిమ్‌ బాల్సిల్లీ (బ్లాక్‌బెర్రీ), శాండీ లెర్నర్‌ (సిస్కో), ఆబ్రే మెక్‌క్లెండన్‌ (చేసాపీక్‌ ఎనర్జీ), సీయాన్‌ రాడ్ (టిండర్‌), సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్సల్‌ (ఫ్లిప్‌కార్ట్‌) మార్క్‌ పిన్‌కస్‌ (జింగా) కూడా వేర్వేరు కారణాలతో సీఈఓలుగా తమ సంస్థల నుంచే వైదొలిగారు.

Exit mobile version