Kiara adavni : ఆ సమయంలో వాళ్ల డైపర్లు కూడా మార్చా.. కియారా షాకింగ్ కామెంట్స్..!
Kiara Adavni : బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంఎస్ ధోని.. ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో ఎనలేని గుర్తింపు వచ్చింది. కియారా అద్వానీ కెరీర్ను ఈ సినిమా టర్న్ చేసినంది. ఈ చిత్రం తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి భరత్ అనే నేను సినిమా చేసింది. ఇదే ఆమెకు మొదటి తెలుగు సినిమా. ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.
రెండో సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ సినిమాలో మెరిసింది. ఎందుకో గానీ ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. హిందీలో మాత్రం వరుస సినిమాలతో మంచి స్వింగ్ లో ఉంది. షేర్షా, గుడ్ న్యూస్, కబీర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నది. అయితే తాను సినిమాల్లోకి రాకముందు ఏ ఉద్యోగం చేసిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది.
డైపర్లు మార్చా..
రేడియో సిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా తన వ్యక్తిగత విషయాలను పంచుకంది. ఫిలిం ఇండస్ర్టీకి రాకముందు తన తల్లి నిర్వహిస్తున్న ప్రీస్కూల్లో నర్సరీ టీచర్ గా పని చేశానని వెల్లడించింది. స్కూల్ లో పిల్లలకు నర్సరీ రైమ్స్ నేర్పించడంతో పాటు డైపర్స్ కూడా మార్చానని షాకింగ్ విషయాలు చెప్పింది. అందుకే తనకు కబీర్ సింగ్, గుడ్ న్యూస్ సినిమాల్లో గర్భిణీ పాత్రలు పోషించడంతొ ఇబ్బంలు ఎదుర్కోలేదని చెప్పింది.
ఉదయం 7 గంటలకు ప్రీ స్కూల్ కు వెళ్లి.. పిల్లలను చూసుకునే దానినని, వారిని ఎలా మేనేజ్ చేయాలో అర్థమైందని చెప్పింది. నర్సరీ రైమ్స్ పాడాను. అక్షరాలు, సంఖ్యలు నేర్పించానని, వారికి డైపర్స్ కూడా మార్చానని వివరించింది. పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది.
కియారా అద్వానీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను 2023లో కుటంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం షేర్షా. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి ఆస్తుల విలువ రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని బాలీవుడ్ టాక్.