
Deputy CM house robbery
Deputy CM house Robbery : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు అయ్యారు. నిందితులను పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేసినట్లు ఖరగ్ పూర్ జిఆర్పీ పోలీసులు తెలిపారు. ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో ఏడో నెంబర్ ప్లాట్ ఫాంపై జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ ను విచారించారు. వీరిద్దరూ భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. వారి నుంచి వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిహార్ కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. దీనిపై తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.