Rajasthan News : డబ్బుల కోసం నాన్ననే మోసం చేసిన యువతి..ఏం చేసిందంటే..
Rajasthan News : పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయమంటే అది చేస్తారు. పిల్లల భవిష్యత్ కోసం వారి సుఖాలను పణంగా పెట్టి అహర్నిషలు కష్టపడుతుంటారు. పిల్లలకు మంచి చదువు చెప్పించడంతో పాటు వారు సెటిల్ అయ్యే దాక గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తారు. వారు మూడు పూటలా తినడానికి తల్లిదండ్రులు పస్తులు ఉంటారు. అల్లారుముద్దుగా పెంచుకుంటూ వారిలోనే తమను చూసుకుంటూ ఉంటారు. పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్ గా భావిస్తూ వారిని ప్రాణప్రదంగా చూసుకుంటుంటారు.
అయితే తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన కొందరు పిల్లలు తల్లిదండ్రులను ఆనందంగా ఉంచడానికి ఉన్నత స్థితికి వెళ్లాలని తపన పడుతుంటారు. చివరకు ప్రయోజకులు అవుతారు. కానీ కొందరు కనిపెంచిన తల్లిదండ్రులను మోసం చేయడానికి కూడా వెనకాడరు. తల్లిదండ్రులకు తమపై ప్రేమను ఆసరాగా తీసుకుని తమ ఎంటర్ టైన్ మెంట్ కోసం వారిని బాధపెడుతుంటారు.
రాజస్థాన్ లో ఓ యువతి రెండో కేటగిరికి చెందింది. తాజాగా ఆ యువతి కిడ్నాప్ వ్యవహారం తల్లిదండ్రులతో పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. శివ్ పురికి చెందిన కావ్య స్నేహితులతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో డ్రామాకు తెరతీసింది. చేతులకు కట్లు వేయించుకుని తండ్రికి ఫొటోలు పంపించి బెదిరించింది. రూ.30లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి సింధియా సైతం ఆ యువతిని త్వరగా కాపాడాలని పోలీసులను ఆదేశించారు. విచారణ చేసిన పోలీసులు ఇదంతా డ్రామా అని..డబ్బుల కోసం యువతి ఆడిన నాటకమని వెల్లడించారు. దీంతో ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా? అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.