YCP Vs TDP Alliance : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రగులుకుంటోంది. పార్టీలు ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నాయి. జగన్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రాన్ని చుడుతున్నారు. ఆ పార్టీ నేతలు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాల్సి ఉన్నా ఎందుకో నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. దీంతో వైసీపీ ప్రచారంలో వెనుకబడిందనే వాదనలు కూడా వస్తున్నాయి. చాలా చోట్ల వైసీపీ ప్రచారం కనిపించడమే లేదు.
జగన్ నాలుగు రోజుల పాటు పది నియోజకవర్గాల్లో పర్యటించినా రాష్ట్రం మొత్తం పూర్తి కాదు. గురువారం హాలీడే తీసుకుంటున్నారు. వ్యూహాల కోసం కేటాయిస్తున్నారో లేక వీడియో గేమ్ లు ఆడుతున్నారో తెలియడం లేదని అంటున్నారు. గతంలో ఆయన కోసం పనిచేసిన స్టార్ క్యాంపెయినర్లు ఒక్కరు కూడా ఇప్పుడు జగన్ వెంట లేరు. దీంతో అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ కూటమి మాత్రం ప్రచారంలో దూసుకుపోతోంది. నాలుగు దిక్కులా క్రౌడ్ పుల్లింగ్ లీడర్స్ తో ప్రజల్లోకి వస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, బాలక్రిష్ణ ప్రతి రోజు సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం ప్రచారంలో కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో వైసీపీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
ఇంతవరకు 75 నియోజకవర్గాల్లో మాత్రమే జగన్ పర్యటించారు. ఇంకా తిరగాల్సినవి చాలా ఉన్నాయి. కానీ జగన్ మాత్రం తొందరపడటం లేదు. దీంతో టీడీపీ కూటమి మాత్రం రాష్ట్రం మొత్తం సుడిగాలిలా పర్యటించింది. ఓటర్లను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించింది. దీంతో కూటమి విజయం తథ్యమని అంటున్నారు. వైసీపీకి భంగపాటు తప్పదని చెబుతున్నారు.
ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే మొగ్గు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదని చెబుతున్నారు. ఈనేపథ్యంలో టీడీపీ తన ప్రభంజనం చూపిస్తుందని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి.